రోజులు గడుస్తున్న కొలదీ పశ్చిమబెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. అటు బీజేపీ.. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ పై చర్చ పెరిగింది. అదేమిటంటే ఫిరాయింపుల భవిష్యత్తుపై. నిజానికి మమతాబెనర్జీనీ ఒంటరిగా ఎదుర్కొనే సత్తా బీజేపీ అగ్రనేతలకు లేదనే చెప్పాలి. అందుకే.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఫిరాయింపులను బీజేపీ అగ్రనేతలు ప్రోత్సహించారు.
Also Read: బీజేపీకి ఇక జగన్ యే దిక్కా?
24 గంటలూ రాజకీయాల్లో విలువలు, నిజాయితీ గురించి గొంతెత్తి మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమోదంతోనే ఫిరాయింపులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే కోల్‌త్తాలో జరిగిన ఓ బహిరంగ సభలో తృణమూల్ పార్టీలో నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు బీజేపీలోకి వస్తున్నట్లు స్వయంగా మోడీనే ప్రకటించారు. అప్పట్లో మోడీ ప్రకటన దేశరాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది.
ఆ తర్వాత నుండి ఓ పద్ధతి ప్రకారం అమిత్ షా ప్రలోభాల పర్వాన్ని దగ్గరుండి రక్తి కట్టించారు. మొత్తం మీద మమతను దెబ్బ కొట్టే టార్గెట్ తోనే 29 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు చాలా మంది నేతలను బీజేపీలోకి లాగేసుకున్నారు. తృణమూల్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన వారిలో అత్యధికుల మీద భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు సైతం ఉన్నాయి. అయినా వాళ్లని బీజేపీ చేర్చుకున్న విషయం చర్చనీయాంశమే.
Also Read: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఎవరికంటే?
అయితే.. ఇప్పుడు వారిలో ఎంతమందికి బీజేపీ టికెట్లిస్తుందో తెలియకుండా ఉంది. అలాగే టికెట్లు తీసుకున్న వారిలో ఎంతమంది గెలుస్తారన్న పాయింట్ మీదే చర్చ నడుస్తోంది. ఏపీలో కూడా చంద్రబాబునాయుడు ఇలాగే ప్రలోభాలకు గురిచేసి 2014లో గెలిచిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి లాగేశారు. అయితే.. వారిలో 17 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లిచ్చారు. అందులో గెలిచింది కేవలం ఒక్కరే. మరి ఇదే పద్ధతిలో బెంగాల్‌లో కూడా జరగటంతో ఇదే పాయింట్ మీద చర్చలు జోరందుకున్నాయి. చూడాలి మరి ఎన్నికల టైమ్ వరకు రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో..!
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్