https://oktelugu.com/

వ్యాక్సిన్ల కోసం కేంద్రంపై 11 రాష్ట్రాల తిరుగుబాటు?

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్నవిధానాలతో రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో బీజేపీయేతర రాష్ట్రాలు  కేంద్ర విధానాలు వ్యతిరేకిస్తూ సిండికేట్ గా ఏర్పడుతున్నాయి. దేశంలోని బీజేపీ యేతర 11 రాష్ట్రాల సీఎంలతో కేరళ సీఎం పినరయ్ విజయన్ మాట్లాడారు. వ్యాక్సిన్ల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సమాయత్తం అవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2021 / 11:05 AM IST
    Follow us on

    దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్నవిధానాలతో రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో బీజేపీయేతర రాష్ట్రాలు  కేంద్ర విధానాలు వ్యతిరేకిస్తూ సిండికేట్ గా ఏర్పడుతున్నాయి.

    దేశంలోని బీజేపీ యేతర 11 రాష్ట్రాల సీఎంలతో కేరళ సీఎం పినరయ్ విజయన్ మాట్లాడారు. వ్యాక్సిన్ల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సమాయత్తం అవుతున్నారు.

    కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న సందర్బంలో గండం నుంచి గట్టెక్కడానికి సంపూర్ణ వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని గుర్తించారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం వైఖరి అసంబద్ధంగా ఉందని సీఎంలు వ్యాఖ్యానిస్తున్నారు. టీకా వినియోగంపై కేంద్రం పట్టించుకోకుండా ఉండడంతో రాష్ట్రాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాపోయారు. వ్యాక్సిన్లు అందరికీ అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తంచాలని కోరారు.

    వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమయ్యారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్రం అనుసరిస్తున్న పద్దతి సరైంది కాదని హితవు పలుకుతున్నారు.. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకవైపు భయాందోళన చెందుతుంటే కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటని మండిపడ్డారు.