కర్రవిరగకుండా పామును చంపే ఎత్తుగడలను కేసీఆర్ వేస్తుంటారు. ఎప్పుడూ ప్రతి అడుగులోనూ ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలు కేసీఆర్ లో ఉంటాయి. ఇటీవల కాంగ్రెస్ మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావును ఆ పార్టీ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెత్తిన బెట్టుకున్నాడు. ఏకంగా పీవీ శతజయంతిని ఏడాది పాటు చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ కు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటినుంచే కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది.
Also Read: కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?
ఎమ్మెల్సీలు రాములు నాయక్, నర్సింహారెడ్డిలతోపాటు కర్నెప్రభాకర్ పదవీకాలం కూడా వచ్చే నెలతో పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఈ మూడు స్థానాలను భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇందులో నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్ ల పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఇక మూడో స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి దయాకర్ రావు పేరును ప్రతిపాదించనున్నారని విశ్వసనీయ సమాచారం.
మాజీ ప్రధాని పీవీ కూతురును కేసీఆర్ ప్రతిపాదించడం వెనుక కేసీఆర్ రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఏకాకిని చేసి దెబ్బతీయడమే పెద్ద ఎజెండా అని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈ తెలుగు యోధుడు పీవీని చరిత్రలో చాలా అవమానించాయి. ఇప్పటికీ ఈయనను పట్టించుకోవడం లేదు. పీవీకి క్రెడిట్ దక్కకుండా కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఈ చర్యతో ఇరుకునపెట్టడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది..
పీవీ శతజయంతి ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ పట్టించుకోని ఈ తెలంగాణ యోధుడిని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటున్నారు. సోనియా గాంధీ సహించని పీవీ జయంతిని తెలంగాణ పండుగలా కేసీఆర్ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తమ పార్టీకే చెందిన పీవీ జయంతిని చేయలేని నిస్సహాయతలో ఉంది. చేస్తే సోనియా ఆగ్రహ జ్వాలలకు బలికావాల్సి ఉంటుంది.
Also Read: అక్కడ కాంగ్రెస్ అనాథ..!
సోనియాగాంధీ పీవీకి సరైన గౌరవం ఇవ్వలేదనే అసంతృప్తి పీవీ కుటుంబంలో ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో పీవీ కుమార్తెకు టీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
-ఎన్నం