https://oktelugu.com/

జీహెచ్ఎంసీ ఎన్నికలపై యోగీ ఆసక్తికర ట్వీట్..!

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటడంతో బీజేపీ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. గ్రేటర్లో అధికార పార్టీకి ధీటుగా సీట్లు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Also Read: గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ పోస్టుమార్టం.. చివరకు తేలిందెంటీ? తాజాగా జీహెచ్ఎంసీ ఫలితాలపై ఉత్తరప్రదేశ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 5, 2020 / 01:21 PM IST
    Follow us on

    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటడంతో బీజేపీ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. గ్రేటర్లో అధికార పార్టీకి ధీటుగా సీట్లు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

    Also Read: గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ పోస్టుమార్టం.. చివరకు తేలిందెంటీ?

    తాజాగా జీహెచ్ఎంసీ ఫలితాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్లో బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు 55 సీట్లకు ధీటుగా బీజేపీ 48సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. అలాగే ఎంఐఎం పార్టీని బీజేపీ మూడో స్థానానికి పరిమితం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

    గ్రేటర్ హైదరాబాద్ ను ఆయన భాగ్యనగరంగా సంబోధిస్తూ ట్వీట్ చేశారు. యోగీ ఆదిత్యనాథ్ గతంలో హైదరాబాద్ వచ్చిన సమయంలో హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారుస్తారా? అని మీడియా ప్రశ్నించగా ఎందుకు మార్చకూడదని తిరిగి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఫైజాబాద్‌ను అయోధ్య అని.. అలహాబాద్‌ను ప్రయాగ్రాజ్ అని మార్చినట్లు ఆయన గుర్తు చేశారు.

    Also Read: ఆ ఒక్కడే చేయగలడు.. కేసీఆర్ పై ఓవైసీ హాట్ కామెంట్స్

    ఈక్రమంలోనే హైదరాబాద్ ను సైతం భాగ్యనగరంగా మారుస్తామంటూ కామెంట్స్ చేశారు. బీజేపీపై గ్రేటర్ వాసులకు నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీపై నమ్మకంతో ఓటేసిన భాగ్యనగరవాసులకు యోగీ ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలతో భాగ్యనగర నిర్మాణానికి పునాదులు పడ్డాయని తెలిపారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్