https://oktelugu.com/

ఈసారి స్టాలిన్ వంతు.. సీఎంలకు మోడీపై లేఖలు

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జూన్21 నుంచి ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ టీకాలు సరఫరా చేయనున్నారు. రాష్ర్టాలపై భారం పడకుండా పైసా ఖర్చు లేకుండా 75 శాతం టీకాలను కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. మిగతా 25 శాతం డోసుల్ని ప్రైవేటుకు కేటాయిస్తామంటూ నరేంద్ర మోడీ చేసిన ప్రకటన తమ ఘనతే నంటూ ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి. డీఎంకే చీఫ్ స్టాలిన్ మరో ముందడుగు వేసి రాష్ర్టాలకు తదుపరి లక్ష్యాన్నిసూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకోవడం, […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2021 4:18 pm
    Follow us on

    CM Stalinదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జూన్21 నుంచి ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ టీకాలు సరఫరా చేయనున్నారు. రాష్ర్టాలపై భారం పడకుండా పైసా ఖర్చు లేకుండా 75 శాతం టీకాలను కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. మిగతా 25 శాతం డోసుల్ని ప్రైవేటుకు కేటాయిస్తామంటూ నరేంద్ర మోడీ చేసిన ప్రకటన తమ ఘనతే నంటూ ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి. డీఎంకే చీఫ్ స్టాలిన్ మరో ముందడుగు వేసి రాష్ర్టాలకు తదుపరి లక్ష్యాన్నిసూచించారు.

    కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకోవడం, ఉచిత టీకాల కోసం రాష్ర్టాలు చేసిన డిమాండ్ నెరవేర్చడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్తగా మరో అంశాన్ని లేవనెత్తారు. సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల రుణాలపై మారటోరియం ప్రకటించాలనే తన డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని కోరుతూ 12 రాష్ర్టాలకు లేఖ రాశారు. దేశంలో సీఎంల ఐక్యత వల్లే కేంద్రం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందని నమ్ముతున్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల రుణాలపై మారటోరియం ఇవ్వాలని కోరారు.
    కరోనా మొదటి వేవ్ సమయంలో రుణగ్రహీతల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరులో, ప్రస్తుత రెండో దశలో రుణగ్రహీతల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరులో అసమానతలున్నాయి. రెండో వేవ్ లాక్ డౌన్ లో కేంద్రం ఆర్థిక ఉద్ధీపన పథకాలేవి ప్రకటించలేదు. అందుకే రూ.5 కోట్ల వరకు రుణాలున్న పరిశ్రమలకు ఊరట కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రులంతా కేంద్ర ఆర్థిక మంత్రికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ క లేఖలు రాయాలని లేఖలో పేర్కొన్నారు.

    దేశ ఆర్థికాభివృద్ధికి ఉద్యోగాల కల్పనకు ఎంఎస్ఎంఈలే ప్రధాన ఆధారమన్నస్టాలిన్ వాటిని మారటోరియం ప్రకటించేలా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుదామంటూ లేఖలు రాసిన వారంతా బీజేపీయేతర ాష్ర్టాల సీఎంలే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్,బెంగాల్ సీఎం మమత, చత్తీస్ గడ్ సీఎం భూపేష్ భగేల్, కేరళ సీఎం విజయన్, మహారాష్ర్ట సఎం ఉద్దవ్ ఠాక్రే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తోపాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్ లకు కూడా స్టాలిన్ లేఖలు రాశారు.