https://oktelugu.com/

CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక… ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

కేంద్రం డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత దీపావళికి కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపు ప్రకటనను వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Written By: , Updated On : October 7, 2023 / 03:45 PM IST
CM KCR

CM KCR

Follow us on

CM KCR: దసరా పండుగకు ముందే ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అంత శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురు చూస్తుండగా జూలై నెలలోనే పెరగాల్సిన డీఏ.. ఇప్పటివరకు పెరగలేదు. ప్రతీ సంవత్సరం రెండుసార్లు డీఏ పెరుగుతోంది. జనవరి అలాగే జూలై రెండుసార్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ మార్చిలో పెరిగింది. ఆ తర్వాత జూలైలో పెరగాల్సిన డీఏ ఇప్పటివరకు పెరగలేదు. దసరా, దీపావళి సందర్భంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఊరిస్తూ, నిరాశను కలిగిస్తుంది…

కేంద్రానికన్నా ముందే..
అయితే, కేంద్రం డీఏను పెంచకముందే తెలంగాణ ప్రభుత్వం డీఏ పెంపును తాజాగా ప్రకటించింది. దసరా కానుకగా ఫెస్టివల్‌ బొనాంజా పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు దీని పెంపును ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ డీఏ పెంపును ప్రకటించారు. 4.8 శాతం డీఏను పెంచుతున్నట్టు తాజాగా వెల్లడించారు. డీఏ పెంపు ఈ సంవత్సరం జులై నుంచి అమలులోకి రానుంది. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్‌ జీతంతో పాటే డీఏ కూడా పెరిగి.. అక్టోబర్‌ జీతంతో రానుంది. 2019 నుంచి ఇప్పటి వరకు టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు 9 డీఏలను ఇన్ స్టాల్ మెంట్ లో ఇస్తున్నారు.

కేంద్రం ప్రకటన కోసం ఎదురు చూపు..
ఇక కేంద్రం డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత దీపావళికి కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపు ప్రకటనను వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఏ పెంపుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది.. ఇక తర్వాత 3శాతం పెరుగుతుందా.. లేక 4% శాతం పెరుగుతుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు…