లాక్ డౌన్ ఎత్తివేసేందుకే కేసీఆర్ నిర్ణయం?

తెలంగాణలో లాక్ డౌన్ ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. తెలంగాణ సర్కారు హైకోర్టు బలవంతం మీద పెట్టింది. రెండో విడత పది రోజుల్లో మాత్రం చాలా సీరియస్ గా అమలు చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ 30 నుంచి ఎత్తేస్తారా? లేక పొడగిస్తారా అనే విషయంలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంతో లాక్ డౌన్ అవసరం లేదన్న భావనతో తెలంగాణ […]

Written By: Srinivas, Updated On : May 27, 2021 2:15 pm
Follow us on

తెలంగాణలో లాక్ డౌన్ ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. తెలంగాణ సర్కారు హైకోర్టు బలవంతం మీద పెట్టింది. రెండో విడత పది రోజుల్లో మాత్రం చాలా సీరియస్ గా అమలు చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ 30 నుంచి ఎత్తేస్తారా? లేక పొడగిస్తారా అనే విషయంలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంతో లాక్ డౌన్ అవసరం లేదన్న భావనతో తెలంగాణ సర్కారు ఉంది.

తెలంగాణలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ప్రభుత్వమే టె స్టులు చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రభుత్వం చేసే టెస్టులకన్నా ప్రైవేటు ల్యాబ్ లు జరిపే టెస్టులే ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్పత్రులు సైతం ఖాళీ అవుతున్నాయి. గాంధీ ఆస్పత్రి గతంలో నిండిపో యింది. ప్రస్తుతం సగం బెడ్లు ఖాళీ అయ్యాయి. ఇతర రాష్ర్టాల వారు వస్తున్నప్పటికీ బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి.

తెలంగాణలో కరోనా పరిస్థితి మరింత తీవ్రంగా లేదన్న అంచనాతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కొనసాగిస్తే సమస్యలు వస్తాయని ఆలో చిస్తోంది. సడలింపులు ఇస్తూ లాక్ డౌన్ ఎత్తివేసే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పది గంటల వరకు ఇచ్చిన సడలింపు 30 తర్వాత మరికొంత కాలం ఇచ్చేందుకు పాలకులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం ప్రారంభిస్తే లాక్ డౌన్ ఎత్తివేసినట్లు భావించవచ్చు.

లాక్ డౌన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. అది లాక్ డౌన్ ఎత్తివేసేందుకే. దీంతో తెలంగాణలో ప్రజల సౌకర్యార్థం లాక్ డౌన్ ఎత్తివేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాలకులకు సైతం లాక్ డౌన్ పొడిగిస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే లాక్ డౌన్ ఎ త్తివేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.