
‘నందమూరి కళ్యాణ్ రామ్’కి హిట్ లేకపోయినా సినిమాల సెలెక్షన్ మాత్రం మొదటినుండి విభిన్నంగానే ప్లాన్ చేస్తున్నాడు. కెరీర్ పరంగా ఇప్పటి వరకు ఒకటి రెండు మంచి కమర్షియల్ సక్సెస్ లు ఉన్నప్పటికీ.. కళ్యాణ్ రామ్ మాత్రం తన మార్క్ సినిమాలను వదులుకోలేక మరో వైవిధ్యమైన సినిమాని చేస్తున్నాడు. అయినా తన శైలి సినిమాలు సక్సెస్ కావు అని అనుభవ పూర్వకంగా తెలుస్తున్నా..
ఎందుకో కళ్యాణ్ రామ్ మాత్రం తాను మెచ్చే చిత్రాల పై ఇష్టాన్ని చంపుకోలేక, మళ్ళీ మరో వైవిధ్యమైన చిత్రాన్ని చేస్తున్నాడు. తన సొంత సంస్థ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బేనర్ లో వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు.
కాగా ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ పీఆర్వో మహేష్ కోనేరు ట్వీట్ చేస్తూ.. ‘కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఇది గేమ్ ఛేంజర్ మూవీ అవుతుందని మేము భావిస్తున్నాం, గత ఏడాదే చిత్రీకరణ మొదలైనప్పటికీ సైలెంట్ గా చిత్ర బృందం పని చేసుకుపోయిందని.. ఇప్పుడు ఈ సినిమా విశేషాలు పంచుకోనున్నామని మహేష్ కోనేరు చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమా ప్రీ లుక్ ను తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సింహం బొమ్మ ఉన్న జెండా.. పుస్తకంలోకి గుచ్చుకున్న ఒక కత్తి.. రెండు వైపులా యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికులు..మొత్తానికి ఈ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఇప్పటివరకూ కళ్యాణ్ రామ్ ఇలా వైవిధ్యమైన కథలతో ఎన్నో కొత్త ప్రయత్నాలు చేసాడు. మరి ఈ ప్రయాగం అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.