CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేనమామ గునిగంటి కమలాకర్ రావు (94) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగ్రామంలో విగత జీవిగా మారారు. ఆయన మరణంపై కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తన బాల్యంలోని గుర్తులు నెమరు వేసుకున్నారు. తన మేనమామతో తనకు గల సంబంధాన్ని గురించి చెప్పుకున్నారు.చిన్నప్పుడు మేనమామ ఇంటికి తరచూ వెళ్లేవాడినని పేర్కొన్నారు. మేనమామ చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కమలాకర్ రావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులంతా కామారెడ్డి చేరుకున్నారు. శనివారం పట్టణంలోని దేవివిహార్ లోని తన సొంత ఇంట్లో కన్నుమూశారు.

బాల్యంలో చాలా సార్లు ఇక్కడికి వచ్చే వాడినని గుర్తు చేసుకున్నారు.సందర్శకుల దర్శనార్థం పార్థివ దేహాన్ని ఇంట్లోనే ఉంచారు. టీఆర్ఎస్ నేతలు అందరు హాజరై నివాళులు అర్పిస్తున్నారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి కేసీఆర్ కుటుంబం హాజరుకాలేదు. కరోనా నేపథ్యంలో పరిమిత వ్యక్తుల మధ్యే దహన సంస్కారాలు నిర్వహించారు. ఎక్కువ మంది గుమిగూడొద్దనే ఆంక్షల నడుమ అంత్యక్రియలు ముగించారు.
దాదాపు పదేళ్ల క్రితం కమలాకర్ రావు భార్య చనిపోయింది. అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు మేనమామ దహన సంస్కారాలకు వచ్చారు. కేసీఆర్ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మేనమామ దూరం కావడంతో కేసీఆర్ విషాదంలో మునిగిపోయారు. తనకు మామకు ఉన్న అనుబంధం గురించి స్మరించుకున్నారు.
కామారెడ్డికి వచ్చిన ప్రతిసారి మేనమామను చూసేందుకు ఇంటికి వెళ్లేవారు. తనతో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకునేవారు. ఎంత బిజీ సమయంలో వచ్చిన మేనమామను మందలించి వెళ్లేవారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. మేనల్లుడంటే మేనమాకు కూడా ఇష్టమేనని బాధాతప్త మాటల్లో వెల్లడించారు.