Homeజాతీయ వార్తలుCM KCR: మరో అస్త్రం సంధించబోతున్న కేసీఆర్‌.. ఈసారి ఉద్యోగులకు..!

CM KCR: మరో అస్త్రం సంధించబోతున్న కేసీఆర్‌.. ఈసారి ఉద్యోగులకు..!

CM KCR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన అమ్ముల పొదిలోని ఒక్కో అస్త్రాన్ని సంధిస్తూ.. రాష్ట్రంలోని అన్నివర్గాలపై వరాలు కురిపిస్తున్నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. దివ్యాంగుల పింఛన్‌ పెంపుతో మొదలైన వరాల.. తర్వాత బీసీలకు ఆర్థికసాయం, మైనార్టీలకు అదే సాయం.. గిరిజనులకు పోడు పట్టాలు.. తాజాగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, పంట రుణాల మాఫీ.. ఇలా ఒక్కో వరం ఇస్తున్నా గులాబీ బాస్‌.. మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతున్నారి తెలుస్తోంది. ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వేతనాలు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో వారిని మచ్చిక చేసుకోవాలని, బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నార.

పీఆర్సీ కమిషన్‌.. ఐఆర్‌కు ఓకే..
ఉద్యోగుల్లో వ్యతిరేత ఉంటే మొదటికే మోసం వస్తుందని గమనించిన కేసీఆర్‌ త్వరలోనే వేతన సవరణ కమిషన్‌తో పాటు మధ్యంతర భృతి ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ ఛైర్మన్‌ రాజేందర్, ప్రధాన కార్యదర్శి మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురువారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఉద్యోగ సంఘాల నేతల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా సీఎం కలిశారు. ఈ సందర్భం ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు రెండో పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల చందాతో ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈట్రస్ట్‌ ద్వారా వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. కేంద్ర తీసుకొచ్చిన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఉద్యోగులు, పింఛనుదారులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రెండు రోజుల్లో పీఆర్సీ, మధ్యంతర భృతిని ప్రకటిస్తామని చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

కేసీఆర్‌ భజనలో ఉద్యోగ సంఘాల నేతలు..
మొదటి నుంచి ఉద్యోగ సంఘాల నేతలను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న కేసీఆర్‌.. ఈసారి కూడా వారు అడగగానే అన్నీ ఓకే అన్నారు. దీంతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన నేతలు సారు భజనలో మునిగిపోయారు. ఆహా.. ఓహో.. సాహో.. జయహో అంటూ కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పీఆర్‌సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులను బిడ్డల్లా చూసుకుంటున్నారని తెలిపారు.

నేతల అవసరాలు తీర్చుకుంటూ..
ఇదిలా ఉంటే.. పలుమార్లు ఉద్యోగుల సమస్యలపై సీఎంను కలిసిన సంఘం నేతలు తమ అవసరాలు తీర్చుకుంటూ పబ్బం గడిపారు. కేసీఆర్‌ కూడా వారిని మేనేజ్‌ చేస్తూ వచ్చారు. కానీ, ఈసారి అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని గులాబీ బాస్‌కు అర్థమైంది. దీంతో వరాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular