CM KCR: దేశంలో మూడో కూటమి కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మూడో కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన పలువురిని కలుస్తూ తమతో కలిసి రావాల్సిందిగా కోరుతున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేసే పనిలో పడిపోయారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కలిసిన ఆయన కేరళ సీఎం విజయన్ ను కూడా హైదరాబాద్ లో కలిసి ఆయనతో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీతో వచ్చిన విభేదాలతో ధాన్యం కొనుగోలు అంశాన్ని దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టిన సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటం చేశారు. కానీ కేంద్రం మాత్రం పట్టించుకోలేదు. దీంతో బీజేపీని ఎండగట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీని మూడోసారి అధికారంలోకి రానీయకుండా చేసేందుకు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు రాజకీయాలను శాసించాలని భావిస్తూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
మరోవైపు రైతు చట్టాలను కూడా సాకుగా చూపుతూ కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించి ఉత్తరాది స్టేట్లపై పట్టు సాధించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీయేతర పక్షాల ఏకీకరణకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేంద్రం తీరును విమర్శిస్తూ ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
మూడో కూటమి ఏర్పాటుపై కేసీఆర్ మార్చి లోపు దాదాపు ఎనిమిది స్టేట్లలో నేతలను సమీకరించి వారితో మంతనాలు జరిపేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలక్కి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకావాలు కనిపిస్తున్నాయి. బీజేపీపై వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ దాదాపుగా గల్లంతైపోయినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొంది. ఇప్పటికే బీజేపీ దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఫలితాలతో ఊపు మీద కనిపిస్తోంది. అందుకే బీజేపీని ఎదగనీయకుండా చేసేందుకే కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో బీజేపీని దేశంలోనే అధికారంలోకి రానీయకుండా చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మూడో కూటమి కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
Also Read: Social media activists: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. అరెస్ట్ లు మొదలుపెట్టిన పోలీసులు
రాష్ర్టంలో రాజకీయాలు కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగానే కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నా ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. సీనియర్లు అడ్డుపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లే. మరోవైపు నాయకత్వ లోపం కూడా కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
Also Read: Telangana: తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకుల దండయాత్రకు అసలు కారణం అదే?
[…] Also Read: CM KCR: టార్గెట్ బీజేపీ: థర్డ్ ఫ్రంట్ దిశగ… […]