కేసీఆర్ దళిత జపం.. ఏంటి కథ?

తెలంగాణ రాక ముందు దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ కు హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొస్తుందని పలు రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనుల ఊసెత్తని కేసీఆర్ కు దళితుల సమస్యలు ఎందుకు గుర్తుకు వచ్చాయంటే వారం రోజుల క్రితం తెలంగాణలోని యాదాద్రిలో మరియమ్మ అనే దళిత మహిళ హత్యకు గురైంది. దీనిపై కాంగ్రెస్ నేతలు సీఎం అపాయింట్ మెంట్ అడిగారు. అప్పటిదాకా సీఎంకు తెలియని విషయంపై స్పందించి సాయం ప్రకటించారు. మరియమ్మ కుటుంబాన్ని […]

Written By: Raghava Rao Gara, Updated On : June 27, 2021 8:35 pm
Follow us on

తెలంగాణ రాక ముందు దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ కు హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొస్తుందని పలు రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనుల ఊసెత్తని కేసీఆర్ కు దళితుల సమస్యలు ఎందుకు గుర్తుకు వచ్చాయంటే వారం రోజుల క్రితం తెలంగాణలోని యాదాద్రిలో మరియమ్మ అనే దళిత మహిళ హత్యకు గురైంది.

దీనిపై కాంగ్రెస్ నేతలు సీఎం అపాయింట్ మెంట్ అడిగారు. అప్పటిదాకా సీఎంకు తెలియని విషయంపై స్పందించి సాయం ప్రకటించారు. మరియమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. దళితుల సమస్యలపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు సాధికారత సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల నుంచి దళిత నేతలను ఆహ్వానించి వారిని ఎలా పైకి తీసుకురావాలనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. దీని కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చుచేస్తామని చెప్పారు. ఇదంతా సబ్ ప్లాన్ కు అదనమన్నారు. సబ్ ప్లాన్ తో రాబోయే మూడు నాలుగేళ్లలో 35 నుంచి 40 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. కేసీఆర్ తో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు మళ్లీ వెళ్లినా బీజేపీ నేతలు మాత్రం బహిష్కరించారు.

ఇదంతా ఎన్నికల గారడీగా పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా దళితుడిని సీఎం చేస్తే వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వారవుతారని తేల్చి చెప్పారు. అది చేయకుండా ఎన్ని చేసినా దళితులు నమ్మరని పేర్కొన్నారు. హుజురాబాద్ లో నలభై వేలకు పైగా దళితుల ఓట్లు ఉన్నాయని దాని కోసమే కేసీఆర్ దళిత మంత్రం జపిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ఏం చేసినా అందులో రాజకీయ వ్యూహం ఉంటుందని చెప్పారు. హుజురాబాద్ ఎఫెక్ట్ తోనే దళిత్ ఎంపవర్ మెంట్ పథకం రూపుదిద్దుకున్నదని ప్రచారం చేస్తున్నారు. ఓట్లు రాబట్టుకోవడం కోసమే కేసీఆర్ దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందే క్రమంలో ఇన్ని తంటాలు పడుతున్నారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలవడం సాధ్యం కాదని చెప్పారు.