తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వద్ద ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తోన్న గటిక విజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే వెల్లడించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను ముఖ్యమంత్రి పీఆర్వో హోదా నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తోన్నారాయన. డిప్యుటేషన్‌పై ముఖ్యమంత్రి వద్ద పీఆర్వోగా విధుల్లో ఉంటున్నారు.
Also Read: వైసీపీలోకి ‘గంటా’.. విజయసాయి క్లారిటీ!
ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలను స్వీకరించిన తొలి రోజుల నుంచే విజయ్ కుమార్ ఆయన దగ్గర పని చేస్తున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా విజయ్ కుమార్‌కు పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. వేర్వేరు జేఏసీల్లో కీలక పాత్ర పోషించారు. విజయ్ కుమార్ స్వస్థలం నెక్కొండ. ప్రాథమికోన్నత విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేశారు. అనంతరం వరంగల్‌లోని ఎల్బీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.
ఇదివరకు కేసీఆర్ సాధించిన విజయాలు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని పొందుపరుస్తూ ఓ పుస్తకాన్ని కూడా రాశారాయన. కాగా.. ఆయన హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలు, ముఖ్యమంత్రి కార్యాలయం, పేషీపై గట్టి పట్టు ఉన్న ఆయన ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్‌గా కూడా రాజీనామా చేయడం రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: కోర్టు ధిక్కరణ కేసు.. ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలు
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విజయ్ కుమార్ రాజీనామా చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. విజయ్ కుమార్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయనకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించి, ఆ జాబ్ నోటిఫికేషన్ జారీ చేశారనే వాదన, విమర్శలు కూడా వచ్చాయి. ఓ పత్రికలో విజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా కొన్ని అవినీతి ఆరోపణలతో కూడిన కథనాలు కూడా వచ్చాయి. అయితే.. ఏడేళ్లుగా సీఎం కార్యాలయంలో పనిచేసిన విజయ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఆయన రాజీనామాకు కారణాలేంటి ? అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్