
CM KCR : ఒక విషయాన్ని జనాలకు సామెతలు, పిట్టకథలతో చెప్పి వారి చేత చప్పట్లు కొట్టించడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. ఆయన భాష, యాస, తెలంగాణపై పట్టు ఓ లెవల్ లో ఉంటుంది. స్వతహాగా ఎంఏ తెలుగు కూడా చేయడంతో తెలుగుపై కేసీఆర్ బాగా పట్టుంది. పద్యాలు, శాస్త్రాలు ఆవపోసన పట్టారు. అలాంటి కేసీఆర్ సభలు, సమావేశాల్లో అప్పుడప్పుడూ తన ప్రత్యర్థులపై సామెతలతో పిట్టకథలతో సెటైర్లు వేస్తుంటాడు.
తాజాగా అసెంబ్లీలోనూ ప్రధాని మోడీపై చెప్పిన ఓ పిట్టకథ వైరల్ గా మారింది. ప్రధాని మోడీ పాలనను అందరూ ఆహా ఓహో అంటున్నారని.. ఆయనకు నిజాలు చెప్పి ఇది తప్పు అని ఎవరూ చెప్పలేకపోతున్నారని.. అందుకే దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మోడీ తెలుసుకోలేకపోతున్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోడీకి వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలతో ముంచడమే కొంప ముంచుతోందన్నారు. ఆయన కూడా వాటిని విని మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. అన్నీ తెలిసే సమయానికి ఆయన మాజీ ప్రధాని అయిపోతారని విమర్శించారు.
మోడీ హయాంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావడం అసాధ్యమంటూ కేసీఆర్ విమర్శించారు. తలసరి ఆదాయంలో భారత్ 138వ స్తానంలో ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువన్నారు.
ఈ సందర్భంగా మోడీ తీరుపై కేసీఆర్ ఒక పిట్టకథ చెప్పారు. తిరుమల రాయుడు అనే ఒక ఒంటి కన్ను రాజు కథను మోడీకి అన్వయించి ఆయన మెప్పు కోసం ఒక మంత్రి చెప్పిన పద్యాన్ని కేసీఆర్ వల్లె వేశారు. ఆయనను పొగిడి పొగిడి దెబ్బతీస్తారని.. ఇప్పుడు మోడీకి కూడా ‘బాగుంది బాగుంది’ అంటూ ఆయనను మాజీ ప్రధానిని చేయబోతున్నారంటూ చెప్పిన పిట్టకథ నవ్వులు పూయించింది. ఎమ్మెల్యేలంతా నవ్వుల్లో మునిగిపోయారు.
https://www.youtube.com/watch?v=nFAixykdzD0&t=14s