కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..కీలక నిర్ణయాలు!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మే 27న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్‌ డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. వర్షాకాల వ్యవసాయం, నియంత్రిత సాగు, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించిన అంశాలనూ చర్చించనున్నారు. ప్రగతి భవన్‌ లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో సగం షాపులు ఒక రోజు, సగం […]

Written By: Neelambaram, Updated On : May 26, 2020 10:53 am
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మే 27న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్‌ డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. వర్షాకాల వ్యవసాయం, నియంత్రిత సాగు, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించిన అంశాలనూ చర్చించనున్నారు. ప్రగతి భవన్‌ లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంత కాలం ఇలాగే కొనసాగించాలా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అటు రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై సీఎం చర్చిస్తారు. గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా లేదా, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయం కూడా చర్చించనున్నారు కేసీఆర్.