CM KCR game plan: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై గత కొద్దిరోజులుగా అనేక ఊహగానాలు నడుస్తున్నాయి. వీటన్నింటికీ సీఎం కేసీఆర్ నిన్న నిర్వహించిన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికలపై తమ గేమ్ ప్లాన్ ఏంటో తేల్చి పారేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు.

2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎనిమిది నెలల ముందుగానే అసెంబ్లీని డిసాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. కేసీఆర్ వ్యూహం ఫలించి బంపర్ విక్టరీతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ ఈ విషయంపై మీడియా ముఖంగా స్పందించారు.
గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తాము ముందస్తు ఎన్నికలకు వెళుతామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈసారి ఆరునెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన ఎన్నికలకు వెళుతామంటూ కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
‘గతంలో ఎనిమిది నెలల ముందే అసెంబ్లీని డిజాల్వ్ చేశాం.. ఇప్పుడు ఆరునెలల ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తాం.. ఫరక్ ఏం పడదు.. గెలుపు మాదే.. ఇది నామాటగా వంద శాతం రాసుకోండి’ అంటూ మీడియాకు సీఎం కేసీఆర్ హితబోధ చేశారు. ఈసారి 95 నుంచి 105 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం తమ దగ్గర మంత్రం ఉందని అది ఎన్నికల సమయంలో ప్రయోగిస్తామని చెప్పడం చూస్తుంటే కేసీఆర్ పక్కా ప్రణాళికలతోనే ముందుకెళుతారనేది ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం రాష్ట్రంలో బీజేపీ మారుతుండగా కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది.
[…] Also Read: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ గేమ… […]
[…] Also Read: CM KCR Plan: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర… […]