Budget 2022: కేంద్రం తీసుకు వచ్చిన బడ్జెట్ కొన్ని రంగాలను ఇబ్బందుల్లో పడేస్తే.. మరొకొన్ని రంగాలకు మాత్రం కొత్త ఊతాన్ని ఇచ్చింది. ముఖ్యంగా మౌలికసదుపాయాల రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. ఎందుకంటే కేంద్రం మూలధన వ్యయాన్ని బాగా పెంచింది. గతం కంటే కూడా 35శాతానికి పెంపుదలను తీసుకు రావడంతో.. ఉత్పత్తి రంగం బాగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ రంగానికి చెందిన కంపెనీలు లాభాల బాట పడుతున్నాయి.

ఆ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పైకి లేచాయి. ముఖ్యంగా కేంద్రం మూలధన వ్యయాన్ని భారీగా పెంచడంతో వస్తు తయారీ రంగం అలాగే నిర్మాణ, వాణిజ్య రంగాలు బాగా లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లతో ఈ రంగాలు కొంత దెబ్బ తిన్నాయి. అప్పుడు వీటికి అనుకున్నంత కేటాయింపులు రాకపోవడంతో.. ఈ సారి ఈ రంగాల మీద కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి మరీ కేటాయింపులు చేసింది.

Also Read: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇంత అన్యాయమా.. పైసలు లేవు.. ప్రాజెక్టులు లేవు..!
ఇక కేటాయింపులు పెంచేయడంతో ఈ రంగంలో కీలకంగా ఉన్నటువంటి ఎల్ అండ్ టీతో పాటు అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి నిర్మాణ రంగానికి చెందిన కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. ఇక వీటితో పాటే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సీమెన్స్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థల షేర్లు కూడా ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. అయితే ఈ రంగాలు ఊహించిన దాని కంటే కూడా అధికంగానే కేటాయింపులు పెంచినట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇలా కేటాయింపులు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడుల ఆగమనాన్ని స్థిరంగా ఉంచారంటూ ప్రశంసిస్తున్నారు చాలామంది. మంగళవారం రోజు నిర్మాణ రంగాలకు చెందిన స్టీల్, సిమెంట్ లాంటి కంపెనీల షేర్లు 4 శాతం నుంచి 7శాతం దాకా పెరిగాయి. ఇక గృహనిర్మాణ ప్రాజెక్టు మీద కూడా కేటాయింపులు అధికంగానే ఉన్నాయి. ఏకంగా రూ.48వేల కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో నిర్మాణ రంగ సంస్థలు మరింత లాభపొందే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Budget 2022: పోలవరం వదిలేసి ‘కెన్ బెత్వా’కు వేల కోట్లు.. మోడీ ఇది న్యాయమా?