https://oktelugu.com/

CM KCR: కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. ఏం తేల్చిందంటే?

CM KCR Delhi Tour: తెలంగాణలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశ పడుతోంది. అయితే రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం టీఆర్ఎస్ కు పెద్దగా అనుకూలంగా లేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రైతుల విషయంలో మోదీ సర్కారును బాదానం చేసి తద్వారా తెలంగాణలో రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని కేసీఆర్ వాదిస్తున్నారు. వన్ నేషన్.. వన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2022 / 12:10 PM IST
    Follow us on

    CM KCR Delhi Tour: తెలంగాణలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశ పడుతోంది. అయితే రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం టీఆర్ఎస్ కు పెద్దగా అనుకూలంగా లేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రైతుల విషయంలో మోదీ సర్కారును బాదానం చేసి తద్వారా తెలంగాణలో రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు.

    ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని కేసీఆర్ వాదిస్తున్నారు. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చి కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కొంచెం పైచేయి సాధించిన మాట వాస్తవమే.

    అయితే కేంద్రం సైతం అదే స్థాయిలో టీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏమేరకు ఎఫ్సీఐకి ధాన్యం ఇస్తారో చెప్పాలని కోరుతోంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఇరుకున పడుతున్నారు.

    ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడేపోడో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ అంటున్నారు. కేంద్రంతో ఎంతకైనా పోరాడుతామని చెప్పిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు దాటిపోయింది. కనీసం ప్రధానితోగానీ, కేంద్ర మంత్రులతో గానీ భేటి అయిన దాఖలాల్లేవు. మరోవైపు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించారా? అంటే అది లేదు.

    దీంతో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సీఎం కేసీఆర్ ఎవరితోనైనా సీక్రెట్ మీటింగ్ పెడుతున్నారా? అన్న చర్చ సైతం నడుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఉత్తరాదిలో తనకు క్రేజ్ వచ్చేలా ప్రచారం జరుగాలని కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే ఢిల్లీలో తన పీఆర్వోగా సంజయ్ కుమార్ ఝాను ఇటీవల నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    సీనియర్ జర్నలిస్టు అయిన సంజయ్ కుమార్ పలు హిందీ పత్రికల్లో పనిచేశారు. సంజయ్‌కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు రెండు లక్షల వేతనాన్ని ఇవ్వనున్నారని సమాచారం. ఈనెల 11న టీఆర్ఎస్ చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి ఆయన ఏర్పాట్లపై ఆయన కొన్ని సూచనలు చేశారట. టీఆర్ఎస్ ధర్నాతో ఉత్తరాదిలో కేసీఆర్ క్రేజ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరీ కేసీఆర్ ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!