https://oktelugu.com/

విమానం దిగిన కారు.. ఫ్లైట్ ఎక్కిన బండి.. పిక్చర్ క్లియర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆయన ఎవర్ని కలుస్తారు? ఏం మాట్లాడుతారు? అంటూ మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది. అయితే.. ఎవరిని కలిసారో ఫొటోలు దొరికాయి కానీ.. ఏం మాట్లాడారనే ఆడియో మాత్రం చిక్కలేదు. దీంతో వచ్చిన కొద్దిపాటి పొగలను బట్టి అందరూ జీహెచ్ఎంసీ పీఠం, ఇతర రాజకీయ కోణంలో వార్తలు వండేశారు. అయితే.. కేసీఆర్ పర్యటన క్లైమాక్స్, బండి పర్యటన ఓపెనింగ్ తో.. నిన్నామొన్న నడిచిన, రేపు ఎల్లుండి నడవబోయే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2020 / 10:14 AM IST
    Follow us on

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆయన ఎవర్ని కలుస్తారు? ఏం మాట్లాడుతారు? అంటూ మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది. అయితే.. ఎవరిని కలిసారో ఫొటోలు దొరికాయి కానీ.. ఏం మాట్లాడారనే ఆడియో మాత్రం చిక్కలేదు. దీంతో వచ్చిన కొద్దిపాటి పొగలను బట్టి అందరూ జీహెచ్ఎంసీ పీఠం, ఇతర రాజకీయ కోణంలో వార్తలు వండేశారు. అయితే.. కేసీఆర్ పర్యటన క్లైమాక్స్, బండి పర్యటన ఓపెనింగ్ తో.. నిన్నామొన్న నడిచిన, రేపు ఎల్లుండి నడవబోయే సినిమా గదేనని అందరికీ క్లియర్ పిక్చర్ వచ్చేసింది.

    Also Read: కేసీఆర్ అడుగులు.. కేంద్రం వైపా.. రైతు పక్షమా?

    కేసీఆర్ దిగారు.. సంజయ్ ఎక్కారు..
    కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకోగానే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. పార్లమెంట్ నిర్మాణంపై మోడీని పొగుడుతూ లేఖ రాసిన మరుసటి రోజే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఆయన అడగడమే ఆలస్యం అన్నట్టుగా.. మోడీ సహా అగ్రనేతలందరి అపాయింట్‌మెంట్లు క్షణాల్లో లభించాయి. అందరితోనూ ఆయన రెండు రోజుల పాటు చర్చలు జరిపి వచ్చేశారు. ఏం చర్చించారు? అన్నది మాత్రం బయటకు చెప్పలేదు. అంటే.. ఇకమీద జరిగే పరిణామాల్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. అయితే… ఒక్క విషయం మాత్రం అందరికీ అర్థమైంది.

    Also Read: దెబ్బపడితే కానీ కేసీఆర్ సార్ కు నిరుద్యోగులు గుర్తుకురాలేదన్న మాట!

    దోస్తీ కోసమే..
    బీజేపీ తో దోస్తీ కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారనేది అందరికీ అర్థమైంది. వ్యక్తిగతంగా వెళ్లిన సీఎం.. బీజేపీ పెద్దలను కలవడం.. ఎందుకో చెప్పకపోవడం.. చివరకు ఆయన రిటర్న్ ఫ్లైట్ ఎక్కగానే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి బయల్దేరడంతో విషయం సమజైపోయింది. గ్రేటర్‌లో మేయరం పీఠం బీజేపీకి ఇచ్చి.. డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ తీసుకుంటుందనే ప్రతిపాదనను కేసీఆర్ పెట్టారని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.. ఈ విషయం మాట్లాడటానికే అధిష్టానం బండిని విమానం ఎక్కించిందని సమాచారం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఏం జరగనుంది..?
    ఇప్పుడుగ్రేటర్ పీఠం తీసుకుంటే ఇక టీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాలుగా ముద్రపడతాయి. దానివల్ల రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగాలనుకుంటున్న కాషాయ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్నది ఇక్కడి నేతల భావన. కానీ.. ఢిల్లీ పెద్దలు మాత్రం.. జాతీయ రాజకీయ అవసరాల కోసమో.. మరో విధమైన వ్యూహం ఉందో కానీ.. కేసీఆర్ ప్రతిపాదనలపై సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా కాకపొతే.. కేసీఆర్ ఇటు రాగానే.. బండికి పిలుపు ఎందుకొస్తుంది అనేది కొందరి సందేహం. మరి, బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయి? అనే బ్యాలెన్స్ స్టోరీని పొలిటికల్ స్క్రీన్ పై చూడాల్సిందే.