హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పథకాల మోత మోగుతోంది. ప్రజలను ప్రసన్నం చేసుకునే క్రమంలో అధికార పార్టీ టీఆర్ఎస్ వినూత్న పంథా ఎంచుకుంది. ఓటర్లను మెప్పించేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. రాజకీయాల్లో కొత్త తరహా విధానానికి శ్రీకారం చుడుతోంది. మిగతా పార్టీలను వెనక్కినెట్టి తన హవా కొనసాగించాలని భావిస్తోంది. గతంలో కేసీఆర్ చేపట్టిన పథకాలపై కూడా ఇదే తీరుగా పెదవి విరిచినా తరువాత ఆశ్చర్యపోయారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమం, 24 గంటల కరెంటు, రైతుబంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో ప్రజల మనసులు దోచుకున్నారు.
2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కూడా అందరిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ ఉపాధి కోసమే పార్టీని స్థాపించారని అందరు అనుకున్నా తరువాత ఆశ్చర్యపోవడం వారి వంతయింది. దీంతో కేసీఆర్ పట్టుదలను చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో కేసీఆర్ సైతం ఇదేదో మగలో పుట్టి పుబలో పోయే పార్టీ అని గేలి చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అధికారం లేకున్నా నడిపించడం మామూలు విషయం కాదని తెలుస్తోంది.
ఇక పథకాల విషయంలో కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేస్తున్నారు. ప్రజల చెంతకు చేరే పథకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ముందు వరసలో ఉన్నట్లు దేశ వ్యాప్తంగా కూడా సర్వేల్లో వెల్లడి అయింది. దీంతో ఆయన తన మనసులో మెదిలిన పథకాలను తూచ తప్పకుండా పాటిస్తూ ప్రజల్లో మెప్పు పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రతి సారి వచ్చే ఎన్నికల్లో గెలుపు బాటపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో రైతుబంధు పథకం కూడా ప్రజల చెంత మంచి మార్కులే కొట్టేసింది. మొదట్టో దీన్ని అందరు వ్యతిరేకించినా తరువాత అవాక్కయ్యారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ సైతం దేశవ్యాప్తంగా చేపడుతూ రైతులకు న్యాయం చేయాలని చూడడం తెలిసిందే. దీంతో కేసీఆర్ బలమేమిటో అందరికి తెలిసిందే. తాను అనుకుంటే ఎంతటి ఘనతనైనా సాధించేందుకు ముందుకు కదులుతారు. దీంతో రైతుబంధు పథకం నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు చేపడుతున్నారు.
ప్రస్తుతం అందరి మెదళ్లను తొలిచేస్తున్న దళితబంధు పథకంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అన్ని వర్గాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. రాష్ర్టంలో అందరికి అందజేసేందుకు సిద్ధమే అని సీఎం ప్రకటించడంతో దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయినా అన్ని పార్టీలు దీనిపై పెదవి విరుస్తున్నాయి. ఈ పథకం అమలులో లోపాలను సరిచేసుకుని అందరికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు చేస్తే ఆర్థికంగా ఎదిగి వారిలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు.