https://oktelugu.com/

Himanshu Graduation : పట్టా పుచ్చుకొని.. తాత కేసీఆర్ చేతుల్లో పెట్టి.. కాళ్ళకు నమస్కరించిన మనవడు హిమాన్షు..

Himanshu Graduation : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాడు. స్నేహితులతో కలిసి అనేక చోట్ల హిమన్షు చేసిన సందడి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ కుర్రాడే కేసిఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు నెటిజన్లు చేశారు. అయితే, తాజాగా హిమాన్సుకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డే వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 09:47 PM IST
    Follow us on

    Himanshu Graduation : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాడు. స్నేహితులతో కలిసి అనేక చోట్ల హిమన్షు చేసిన సందడి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ కుర్రాడే కేసిఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు నెటిజన్లు చేశారు. అయితే, తాజాగా హిమాన్సుకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డే వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే..

    కేటీఆర్ కుమారుడు హిమాన్షు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. 12వ తరగతి పూర్తి అయిన విద్యార్థులకు మంగళవారం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ను స్కూల్ యాజమాన్యం నిర్వహించింది. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్సుకు ఎక్స్లెన్స్ అవార్డు అందించింది స్కూల్ యాజమాన్యం. గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న మనవడు వెంటనే స్టేజి దిగివచ్చి తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పట్టా పెట్టి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకున్నాడు. ఇది చూసిన ఎంతో మంది గౌరవ మర్యాదలు గొప్పగా పాటిస్తున్నాడు అంటూ చెప్పుకున్నారు.

    కార్యక్రమానికి కుటుంబమంతా కలిసి హాజరు..

    మనవడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబం అంతా హాజరైంది. ముందు వరుసలో సీఎం కేసీఆర్ తోపాటు ఆయన మనమరాలు, భార్య, కుమారుడు కేటీఆర్ తదితరులు కూర్చుని గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ వీక్షించారు. ఈ సందర్భంగా పట్టా పుచ్చుకున్న మనవడిని చూసి కెసిఆర్ ఎంతగానో ఆనందించారు. అనంతరం కెసిఆర్ స్కూలుకు సంబంధించిన ఉన్నతాధికారులతో కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ సీఎం, తాత కెసిఆర్ సమక్షంలో పట్టాను పుచ్చుకోవడంతో హిమాన్సు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. పట్టా పుచ్చుకున్న సందర్భంలో హిమాన్సు ముఖం వెలిగిపోయింది. కొడుకు పట్టా పుచ్చుకుంటుండడంతో కేటీఆర్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కనిపించారు.