
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి జీవితం, ఆయన సినీ ప్రయాణం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన, స్వయంకృషి తో పట్టుదలతో తన టాలెంట్ ని నమ్ముకొని ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆయన.ఇప్పటికీ చిరంజీవి కి పోటీ ఇచ్చే మొనగాడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టలేదు అంటే ఏమాత్రం అతి సయోక్తి లేదు.
ఆయన స్థాయి మరియు ఆయన స్థానం అలాంటిది మరి.అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ప్రారంభం నుండే హీరోలు అయిపోరు.తొలుత చిన్న చిన్న పాత్రల ద్వారానే ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలి.చిరంజీవి నట జీవితం కూడా అలాగే మొదలైంది.తొలుత సైడ్ క్యారెక్టర్స్ మరియు నెగటివ్ రోల్స్ ద్వారానే ఆయన కెరీర్ ప్రారంభం అయ్యింది, ఆ తర్వాత హీరో గా మారి సినిమాలు చేస్తూ వచ్చాడు..ఖైదీ చిత్రం నుండి స్టార్ గా ఎదిగాడు.ఇదంతా మనకి తెలిసిన విషయమే, కానీ తెలియని మరో విషయం ఏమిటంటే చిరంజీవి అప్పట్లో ఒక డైలీ సీరియల్ లో కూడా నటించాడు.
అది కూడా తెలుగు సీరియల్ కాదు, హిందీ సీరియల్.అప్పట్లో ‘రజని’ అనే పాపులర్ హిందీ సీరియల్ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.ఇందులో చిరంజీవి ఒక ముఖ్యమైన పాత్రలో కొన్ని ఎపిసోడ్స్ వరకు కనిపిస్తాడు.అలా కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత చిరంజీవికి సినిమా అవకాశాలు వల్ల కెరీర్ బిజీ అయిపోయింది.అందువల్ల ఈ సీరియల్ నుండి మధ్యలోనే బయటకి వచ్చేయాల్సి వచ్చింది.ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు,సినీ కెరీర్ ప్రారంభం అయిన తర్వాత చిరంజీవి అప్పట్లో ఒక్క ఏడాది కూడా ఖాళీగా ఉన్నది లేదు.
ఏడాది కి 10 , 15 సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇప్పటికీ కూడా ఆయన కుర్ర హీరోలతో పోటీ పడుతూ ఏడాది కి మూడు సినిమాలు చేస్తున్నాడంటే సినిమా అంటే ఆయనకీ ఎంత పిచ్చి అనేది అర్థం అవుతుంది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి, ఆగష్టు 11 వ తేదీన భోళా శంకర్ సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు.