CM KCR and KTR: సూది కథ… ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ పదేపదే∙చెబుతున్న స్టోరీ. ఎక్కడ మీటింగ్ పెట్టినా కథను అక్కడి దేవుళ్లు… అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నారంతే.. మిగతాది సేమ్ టూ సేమ్!
మొలుపెట్టిన కేసీఆర్..
ప్రజలను మాటలతో మెస్మరైజ్ చేయడంలో కేసీఆర్ దిట్ట. ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినా.. ఆ సభలో కచ్చితంగా ఏదో ఒక కథ చెప్పడం కేసీఆర్‌కు అలవాటే. ఇటీ కొన్ని రోజులుగా ఆయన ఒకే కథ రిపీట్ చేస్తున్నారు. అదే సూది కథ. ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ అక్కడ సూది కథ మొదలు పెట్టారు.
కథేంటంటే..
‘ఓ మేరాయన బట్టులు కుడుతున్నాడు.. ఆ సమయంలో సూది జారిపోయి కింద పడింది.. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి… సూది దొరికేటట్లు చెయ్యి.. నీకు 10 కిలోల చెక్కర కానుకగా ఇస్తా అని మొక్కుకున్నాడు. ఆ మాటలు విన్న ఆయన భార్య.. పరుగున వచ్చి.. ఏమయ్యో పది పైసల సూదికి పది కిలోల చెక్కర పంచుతువా.. నీకేమన్న తెలివి ఉందా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ మేరాయన.. సూదైతే దొరకనీయరాదే.. మొక్కు తీసి గట్టున పెడదాం అన్నాడట’ కాంగ్రెస్ హామీలు కూడా ఈ కథలోని మేరాయన మొక్కులెక్కనే ఉంటాయని కేసీఆర్ వివరించారు.
రిపీట్ చేస్తున్న కేసీఆర్..
పక్షం రోజులుగా కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని ఆయన తనయుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆరే తెలిపారు. దీంతో ఎన్నికల ప్రచార బాధ్యతలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల బాధ్యతను ఆ ముఖ్యమైన మంత్రే భుజాన వేసుకున్నారు. వరుసగా పర్యటనులు చేస్తున్నారు. మొన్న మహబూబ్‌నగర్, తర్వాత ఖమ్మం, ఆ తర్వాత మంచిర్యాల, పెద్దపల్లి, తాజాగా నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ల నాయిన కేసీఆర్ చెప్పిన సూది కథను రిపీట్ చేస్తున్నారు. అయితే దేవుళ్లను మాత్రం మారుస్తున్నారు. ఇక మేరాయన స్థానంలో ఓ ముసలవ్వ క్యారెక్టర్ పెట్టారు కేటీఆర్. మిగతా కథ మొత్తం అదే చెబుతున్నారు. మహబూబ్ నగర్‌లో ముసలవ్వ సూది కోసం జోగులాంబ తల్లిని మొక్కిందటన.. ఖమ్మంలో అదే ముసలవ్వ భద్రాద్రి రామున్ని మొక్కిందట. పెద్దపల్లిలో ఓదెల మల్లన్నను మొక్కిందట.. మంచిర్యాలలో మరో దేవుడిని మొక్కిందట. ఇలా దేవుళ్లను మారుస్తూ కేటీఆర్ సూది కథ రిపీట్ చేస్తున్నారు. సోమవారం నల్లగొండ సభలో నర్సింహస్వామిని మొక్కిందని చెబుతారని ప్రజలు ఇప్పటికే చెబుతున్నారు.
టార్గెట్ కాంగ్రెస్..
కాంగ్రెస్ గ్యారెంటీ హామీలతో బీఆర్‌ఎస్‌లో కొంత భయం మొదలైనట్లు కనిపిస్తోంది. దీంతో కేటీఆర్ పిట్టకథలో 135 ఏళ్ల కాంగ్రెస్‌ను 135 ఏళ్ల ముసలవ్వగా పేర్కొంటున్నారు. గ్యారెంటీ హామీలను, ముసలవ్వ మొక్కులుగా చెబుతున్నారు. ముసలవ్వ ఆపద మొక్కుల లెక్కనే కాంగ్రెస్ గ్యారెంటీ హామీలు ఉంటాయని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Cm kcr and ktr shares same stories
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com