CM Jagan Plain : కాంగ్రెస్ ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన చనిపోయారని చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కనుక బతికి ఉంటే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. అసలు తెలంగాణనే రాకుండా ఉండేది. ఉమ్మడి విడిపోకుండా నిలిచేది. అయితే వైఎస్ఆర్ హెలిక్యాప్టర్ ప్రమాదం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటారు.

అందుకే వీఐపీలు, సీఎంలు వైఎస్ఆర్ హెలిక్యాప్టర్ ప్రమాదం తర్వాతా చాలా వరకు హెలిక్యాప్టర్ ల కంటే విమానాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఆ అపశ్రుతులు వైఎస్ కుటుంబాన్ని ఇప్పటికీ భయపెడుతుండడం కలకలం రేపుతోంది.
ఒక రాష్ట్రానికి సీఎం ప్రయాణిస్తున్న విమానం ఎంత పకడ్బందీగా ఉండాలి. వీఐపీల భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండరు. కానీ సీఎం జగన్ విషయంలో తాజాగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
సీఎం జగన్ రేపు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి ఈరోజు సాయంత్రం బయలు దేరారు. సాయంత్రం బయలుదేరిన జగన్ విమానం అత్యవసరం 20 నిమిషాలకే వెనక్కి తీసుకొచ్చి మరీ గన్నవరంలో ల్యాండ్ చేశారు. జగన్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఇలా అత్యవసరంగా దించేశారని అంటున్నారు.
విమానం ఏసీ వాల్వ్ లో లీకేజీ వల్ల సమస్య ఏర్పడినట్లు సీఎంవో అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారని తెలిపారు. దీంతో ఢిల్లీ ప్రయాణాన్ని జగన్ వాయిదా వేసుకున్నారు. రేపు అధికారులతో కలిసి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం వెంట సీఎస్ జవహర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అధికారులు మాలకొండయ్య, కృష్ణమోహన్ రెడ్డి , చిదానందరెడ్డి ఉన్నారు.
వైఎస్ఆర్ కు ప్రమాదం జరిగిన తర్వాత జగన్ కు ఇప్పుడు ఇలా అనుకోని ఉపద్రవాలు జరిగే సరికి వైసీపీ శ్రేణులు కంగారుపడుతున్నాయి. దీన్ని అనుమానపు కోణంలోనే చూస్తున్నాయి.