CM Jagan: ఏపీ సీఎం జగన్ పై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి.ఆలుగడ్డ..ఉల్లిగడ్డ అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఆ మాత్రం కనీస అవగాహన లేదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో తుఫాను బాధితుల పరామర్శలో సీఎం తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తుఫాను బాధితులకు అందించే సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. సీఎం వైపు అనుమానపు చూపులు చూశారు. దీంతో ఆయన పొటాటోని ఉల్లిగడ్డే అంటారుగా అని అధికారులను అడగడంతో వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నవారు పొటాటోను బంగాళదుంప అంటారని చెప్పడంతో కొద్దిపాటి ఆశ్చర్యంతో కూడిన నవ్వులు కనిపించాయి.
అయితే ఈ చిన్నపాటి విషయంపై కూడా అవగాహన లేకపోవడంతో సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అక్కడితో ఆగని సీఎం జగన్ బంగాళ… దుంప.. అంటూ పొడిపొడిగా మాట్లాడారు. ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి. మీమ్స్ జతచేసి పోస్టులు పెడుతున్నారు. వినూత్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
