Rajamouli: మహేష్ బాబు మూవీ తర్వాత ఆ స్టార్ హీరోని లైన్ లో పెట్టిన రాజమౌళి…

విజయేంద్రప్రసాద్ అయితే విక్రమార్కుడు సినిమా స్టోరీని ముందుగా పవన్ కళ్యాణ్ తో చేద్దామని అనుకున్నాం కానీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ సినిమా రవితేజతో చేయాల్సి వచ్చింది అని చెప్పాడు.

Written By: Gopi, Updated On : December 9, 2023 9:45 am

Rajamouli

Follow us on

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు తెలుగులోనే కాదు ఇండియాలోనే లేడు అనే చెప్పాలి. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సాధించడంతోపాటు ఇండస్ట్రీ రికార్డును కూడా కొల్లగొడుతూ వస్తున్నాయి. ఇక రాజమౌళి తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో మాత్రం సినిమాలు చేయలేదు వాళ్ళిద్దరితో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి అని చాలామంది చాలాసార్లు రాజమౌళిని అడిగారు దానికి సమాధానంగా ఆయన పవన్ కళ్యాణ్ తో నేను ఒక సినిమా చేయాలని ఒక కథ చెప్పాను కానీ ఆ టైంకి అయిన ఫ్రీగా లేకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను అంటూ చాలా సార్లు సమాధానం ఇచ్చాడు.

ఇక వీళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ అయితే విక్రమార్కుడు సినిమా స్టోరీని ముందుగా పవన్ కళ్యాణ్ తో చేద్దామని అనుకున్నాం కానీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ సినిమా రవితేజతో చేయాల్సి వచ్చింది అని చెప్పాడు…ఇక అల్లు అర్జున్ తో సినిమా ఎందుకు చేయలేదు అని అడగగా అల్లు అర్జున్ తో మగధీర తర్వాత ఒక సినిమా చేయడానికి చర్చలు జరిగినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో అది అల్లు అర్జున్ తో చేయడానికి వీలు కాలేదు అంటూ చాలాసార్లు చెప్పడం విశేషం. ఇక మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు కాబట్టి మహేష్ బాబు ప్రాజెక్ట్ అయిపోగానే అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి ఎక్కించే ప్రయత్నం అయితే రాజమౌళి చేస్తున్నట్టుగా బ్యాక్ ఎండ్ నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా విజయేంద్ర ప్రసాద్ మొత్తం పూర్తి చేసినట్టు గా తెలుస్తుంది. అది అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ లోపల లోపల మాత్రం స్క్రిప్ట్ కి సంబంధించిన పూర్తి పనులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మహేష్ తో కనక చేసే సినిమా సక్సెస్ సాధిస్తే రాజమౌళి వరల్డ్ లో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచిపోతాడు. కాబట్టి అల్లు అర్జున్, రాజమౌళి చేసే సినిమాకి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ రావడంతో పాటు అల్లు అర్జున్ పాన్ వరల్డ్ హీరోగా కూడా ఎస్టాబ్లిష్ అవుతాడు అని చెప్పడం ఎంత మాత్రం సందేహం లేదనే చెప్పాలి…