
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత ఐదురోజులుగా కొనసాగుతోన్నాయి. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి.. సీఎం జగన్ లకు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు సైటర్లు వేసుకుంటూ అసెంబ్లీ సమావేశాలను ముందుకు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే నేడు అసెంబ్లీలో ‘ఈనాడు’ దిన పత్రికను సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఈనాడు వార్తలను ఎలా వడ్డి వారిస్తుందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశారు. ఈనాడు పత్రిక అనేది చంద్రబాబు నాయుడి కరపత్రిక అని.. ఆయన ఏం చెబితే అదే ఆ పేపర్లో వస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..?
వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పింఛన్లపై’ ఈనాడు ప్రచురించిన బ్యానర్ కథనాన్ని సీఎం జగన్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఒక అబద్ధాన్ని.. అబద్ధమని తెలిసి కూడా దిగజారి పదేపదే అదే ప్రచారాన్ని ఈనాడు చేస్తోందని ఆరోపించారు. పింఛన్లపై ఈనాడు రాసిన కథనాన్ని అసెంబ్లీలో క్లిప్పింగ్స్ వేసి చూపించారు.
‘పింఛన్ల’ కథనం చూస్తే నిజమేనా? అనేలా ‘ఈనాడు’ తప్పుడు కథనాన్ని ప్రచురించిందని సీఎం అన్నారు. పింఛన్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి ఏంటి? అనేది ఎన్నికల ప్రచారంలో తను ఇచ్చిన హామీ ఏంటి? అనేది మరో క్లిప్లింగ్ వేసి చూపించారు. ఈ సందర్భంగా ఈనాడు.. ఆంధ్రజ్యోతి.. టీవీ-5లు చంద్రబాబుకు అమ్ముడుపోయాయని విమర్శించారు.
Also Read: కాంగ్రెస్ పనైపోయింది.. బీజేపీయే ప్రత్యామ్మాయం!
ఈ చర్చలో భాగంగానే జగన్ మరో కీలక ప్రకటన చేశారు. 2021జులై 8 వైఎస్ఆర్ జయంతి నుంచి రూ.2,500కు పింఛన్ పెంచబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక 2022లో వైఎస్ఆర్ జయంతికి రూ.2,750కు పెన్షన్.. 2023 జులై 8న పెన్షన్ రూ.3వేలకు పెంచనున్నట్లు తెలిపారు. చంద్రబాబులా తాను మాట తప్పే మనిషిని కాదని..మాట మీద నిలబడుతానంటూ జగన్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్