https://oktelugu.com/

CM Jagan: ఆ కులం కార్డు ప్రయోగిస్తున్న జగన్

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలో చేరనున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

Written By: , Updated On : February 19, 2024 / 10:12 AM IST
Jagan using that caste card
Follow us on

CM Jagan: ఏపీలో బీసీల పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగుదేశం. టిడిపి ఆవిర్భావం తర్వాత బీసీ నాయకులు పుట్టుకొచ్చారు.రాజకీయాల్లో రాణిస్తున్నారు. చంద్రబాబు సైతం బీసీ నేతలను ప్రోత్సహిస్తూ వచ్చారు. అందుకే బీసీలు గత ఎన్నికల వరకు టిడిపి వెంట నడిచారు. జగన్ ఇచ్చిన హామీలతో అటువైపు టర్న్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీసీల ఓట్లను పదిలం చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బీసీ జపంతో ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున బీసీలకు టికెట్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపికి ఒక రకమైన హెచ్చరిక పంపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా యాదవులకు పెద్ద ఎత్తున టిక్కెట్లు కేటాయిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సైతం యాదవులకు టికెట్లు ఇవ్వడం విశేషం.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలో చేరనున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఏలూరు నుంచి మరోసారి బరిలో దిగేందుకు మాగంటి బాబు సిద్ధమయ్యారు.అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ కు జగన్ ఛాన్స్ ఇచ్చారు. మరో ఒకటి రెండు చోట్ల ఎంపీ అభ్యర్థులుగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలను జగన్ బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది.

మైలవరం టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దాదాపు ఖరారయ్యారు.అక్కడ వైసిపి నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుమలరావును జగన్ ఎంపిక చేశారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు టిడిపి నుంచి పోటీ చేస్తుండగా.. అరవింద యాదవ్ కు జగన్ ఛాన్స్ ఇచ్చారు. కనిగిరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు. అక్కడ వైసీపీ నుంచి నారాయణ యాదవ్ పోటీ చేయనున్నారు. తణుకు నుంచి టిడిపి అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి కారుమూరు నాగేశ్వరరావు బరిలో దిగనున్నారు. ఈయన కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇంకా అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉండడంతో..చాలామంది యాదవ నాయకులకు జగన్ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీల్లో మెజారిటీ కులం గా భావించే యాదవులకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారని.. మిగతా బీసీ కులాల పరిస్థితి ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.