FIR On Chandrababu: చంద్రబాబుతో సహా కీలక నేతలపై హత్యాయత్నం కేసు

ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,అమర్నాథ్ రెడ్డి, చల్లా బాబు, పులివర్తి నానితదితర నాయకులపై ఏడు కేసులు పెట్టారు. మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయి.

Written By: Dharma, Updated On : August 9, 2023 12:03 pm

FIR On Chandrababu

Follow us on

FIR On Chandrababu: పుంగనూరు లోని అంగళ్ళు ఘటనకు సంబంధించి చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఆయనతోపాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎక్కడ వైసీపీకి మట్టి అంటకుండా.. పోలీసులతోనే ఈ ఫిర్యాదుల పర్వాన్ని కొనసాగించారు. ఆ మేరకు మాత్రమే కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో వైసిపి నేతలకు ఇబ్బంది రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే.. పోలీసులను ఉసిగొల్పి ఈ చర్యలకు దిగారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో కానీ.. బయటకు వచ్చిన ఏడు, ఎనిమిది కేసుల్లో ఫిర్యాదుదారులు మాత్రం పోలీసులే. కిందిస్థాయి కానిస్టేబుళ్లతో ఫిర్యాదులు చేయించి టిడిపి నేతలు అందరిపైనా ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తున్నారు. ఇది పోలీస్ శాఖ లోనే సంచలనంగా మారుతోంది. తాజాగా చంద్రబాబుపై ముదివీడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఏ1 గా చంద్రబాబు, ఏ 2గా దేవినేని ఉమ, ఏ 3గా అమర్నాథ్ రెడ్డి, ఏ 4 గా చల్లా బాబులపై కేసు నమోదు అయ్యింది. నిన్న మొన్నటి వరకు పుంగనూరు తెలుగుదేశం నాయకులు పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రస్థాయి నాయకులు పై కేసులు నమోదు చేస్తుండడం విశేషం.

ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,అమర్నాథ్ రెడ్డి, చల్లా బాబు, పులివర్తి నానితదితర నాయకులపై ఏడు కేసులు పెట్టారు. మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయి. చివరకు అనంతపురానికి చెందిన మరో ఏ ఆర్ కానిస్టేబుల్ ఫిర్యాదు తో మరికొన్ని కేసులు నమోదు చేశారు. పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే వైసీపీలో కలిసి పోయారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు వ్యవస్థ బలహీనంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆది నుంచి ఈ ఘటనలో ఎస్పీ రిశాంత్ రెడ్డి వ్యవహార శైలి పై అనుమానాలు ఉన్నాయి. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ ఇక్కడ అల్లరి చేసిన వైసీపీ నేతల ఇష్యూ తేవడం లేదు. కేవలం టిడిపి నేతలదే తప్పన్నట్టు పోలీసుల వ్యవహార శైలి ఉంది. మొత్తం ఘటనను పోలీసులు తమ మీద వేసుకొని రాజకీయం చేస్తున్నట్టు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.