Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan Mohan Reddy: ఉద్యోగులు జర జాగ్రత్త.. అక్కడున్నది జగన్

CM Jagan Mohan Reddy: ఉద్యోగులు జర జాగ్రత్త.. అక్కడున్నది జగన్

CM Jagan Mohan Reddy: పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోంది. ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఏమవుతుందో చూద్దామనే ధోరణిలో వ్యవహరిస్తోంది. దీంతో ఉద్యోగులు కూడా ఏం చేయని పరిస్థితి. దీన్ని అడ్వాన్స్ గా తీసుకున్న జగన్ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను లెక్క చేయడం లేదు. వారు అడిగినంత ఫిట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఉద్యోగులు జగన్ కు మధ్య పొసగడం లేదని తెలుస్తోంది.

AP CM Jagan

ఉద్యోగులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. సమ్మె చేద్దామంటే ప్రజల్లో చులకన అయిపోతామనే భావం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. దీంతో వారు వేచి చూసే ధోరణికి ఇష్టపడుతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న జగన్ వారికి ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. దీంతో రాష్ర్టంలో ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: CM Jagan Vs Tollywood: టాలీవుడ్ కు ‘సినిమా’ చూపిస్తున్న జగన్

తమను ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వమే తమతో ఆడుకుంటోందని వాపోతున్నారు. పీఆర్సీ ప్రకటించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పీఆర్సీ పై ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది. కానీ కొలిక్కి రావడం లేదు. ఉద్యోగుల ఆశలు తీరడం లేదు. దీంతో వారు వేచి చూద్దామనే ధోరణిలోనే ఉండిపోతున్నారు. ప్రభుత్వమైతే వారికి తీపి కబురు ఎప్పుడు చెబుతుందో అని ఎదురు చూస్తున్నారు.

ప్రజలు కట్టే పన్నులతో బతుకుతున్న ఉద్యోగులు వారికి మేలు చేయడం లేదనే భావం అందరిలో కలుగుతోంది. అందుకే ఉద్యోగులపై భారం పడుతోంది. దీన్ని సాకుగా తీసుకుంటున్న ప్రభుత్వం వారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటోంది. వారితో పనులు చేయించుకుంటున్నా సరైన సమయంలో వేతనాలు మాత్రం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తోంది. దీంతో వారు అటు ఆందోళన చేయలేక ఇటు ప్రభుత్వంతో రాజీ పడలేక నానా తంటాలు పడుతున్నారు. మొత్తానికి జగన్ ప్రభుత్వం ఎప్పటికి పీఆర్సీ ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.

Also Read: CM Jagan – CM KCR: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్‌కు ఎదురీత తప్పదా..?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version