CM Jagan- KTR: దావోస్ లో ఆర్థిక సదస్సు జరుగుతోంది. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రతినిధులుగా హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అక్కడి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడేమో ఎడమెహం పెడమొహంగా ఉంటున్న నేతలు అక్కడ మాత్రం స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. దావోస్ లో ఏపీ ప్రభుత్వం అదానీ గ్రూపు మధ్య ఏకంగా రూ. 60 వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మౌలిక సదుపాయాలు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. దీనిపై ఏపీ మంత్రులు కూడా స్పందించి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని గ్రహించిన కేటీఆర్ జగన్ తనకు సోదరుడితో సమానమని మళ్లీ తన వ్యాఖ్యలు సవరించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వైరుధ్యాలే ఏర్పడ్డాయి.
Also Read: Rajamouli Advice For Pushpa: రాజమౌళి ఇచ్చిన ఆ సలహా వల్లే పుష్ప ఇంత పెద్ద హిట్ అయ్యిందా!
దీంతో అక్కడ దోస్తీ ఇక్కడ కుస్తీ అన్న చందంగా మారింది పరిస్థితి. కేటీఆర్, జగన్ దావోస్ లో చిరునవ్వులు చిందిస్తూ తమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దావోస్ వేదికగా దొరబాబుల్లా సూట్ వేసుకుని కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీల విషయంలో ఇద్దరు అక్కడి కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థిస్తున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా చేయూతనందించాలని కోరుతున్నారు.

దావోస్ లో పెట్టుబడులు పెట్టాలని రెండు తెలుగు రాష్ట్రాలు పోటీగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నా ఏపీ మాత్రం పెద్ద మొత్తంలో పెట్టుబడులు సాధించడం గమనార్హం. తెలంగాణ రూ. 600 కోట్ల విలువైన పెట్టుబడులు సాధించింది. రూ.500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ముందుకెళుతోంది. స్పెయిన్ కు చెందిన బహుళ జాతి కంపెనీ కీమో ఫార్మా రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో రెండు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read:YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ చనిపోయాక ఏం చేశాడో తెలుసా?
Recommended Videos:


[…] […]
[…] […]