కరోనా రెడ్ జోన్లోకి సీఎం నివాసం.. అధికారుల్లో టెన్షన్!

ఏపీ ముఖ్యమంత్రి నివాసం తాజాగా కరోనా రెడ్ జోన్లోకి వెళ్లింది. గురువారం వరకు సీఎం నివాసం బఫర్ జోన్లో ఉండగా రెండ్రోజుల్లోనే రెడ్ జోన్ గా మారిపోయింది. సీఎం నివాసానికి కొద్దిరూరంలో మహిళ కరోనాతో మృతిచెందింది. దీంతో ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా గుర్తించారు. సీఎం నివాసానికి కొద్దిరూరంలో కరోనాతో మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఓ మహిళ అనారోగ్యంతో మృతిచెందింది. అనుమానం వచ్చిన వైద్యులు శవానికి […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 1:20 pm
Follow us on


ఏపీ ముఖ్యమంత్రి నివాసం తాజాగా కరోనా రెడ్ జోన్లోకి వెళ్లింది. గురువారం వరకు సీఎం నివాసం బఫర్ జోన్లో ఉండగా రెండ్రోజుల్లోనే రెడ్ జోన్ గా మారిపోయింది. సీఎం నివాసానికి కొద్దిరూరంలో మహిళ కరోనాతో మృతిచెందింది. దీంతో ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా గుర్తించారు. సీఎం నివాసానికి కొద్దిరూరంలో కరోనాతో మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఓ మహిళ అనారోగ్యంతో మృతిచెందింది. అనుమానం వచ్చిన వైద్యులు శవానికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. చనిపోయిన మహిళ తాడేపల్లి పాత గేట్ వద్ద అపార్ట్ మెంట్లో ఉండేది. ఈ ప్రాంతం సీఎం నివాసానికి కొద్దిదూరంలోనే ఉంది. దీంతో ఆ ప్రాంతాన్నిఅధికారులు మార్కింగ్ చేసి రెడ్ జోన్ గా గుర్తించారు.

అలాగే రెండ్రోజుల క్రితం డోలాస్ నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళగిరి కమర్షియల్‌ టాక్సెస్‌ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న సదరు ఉద్యోగి తాడేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడు. దీంతో అపార్టుమెంట్లోని వారిని బయటకు రాకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. అపార్టుమెంట్ వారితోపాటు చుట్టుపక్కల వారి వివరాలు సేకరించి పలువురిని అధికారులు క్వారెంటైన్‌‌కు తరలించారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించి అటుగా ఎవరూ వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాగా గుంటూరులో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సీఎం నివాసమే రెడ్ జోన్లోకి వెళ్లడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.