https://oktelugu.com/

Kadali Nani: సంచలనం: కొడాలి నానికి జగన్ షాక్.. టికెట్ నిరాకరణ

గుడివాడలో కమ్మ సామాజిక వర్గం అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని గత నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 19, 2024 / 12:53 PM IST
    Follow us on

    Kadali Nani: గుడివాడ నుంచి కొడాలి నానిని తప్పించనున్నారా? తెరపైకి కొత్త అభ్యర్థి రానున్నారా? నానికి టిక్కెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గుడివాడ అంటే కొడాలి నాని.. కొడాలి నాని అంటే గుడివాడ అన్న రేంజ్ లో పరిస్థితి ఉంది. వరుసగా నాలుగు సార్లు గెలిచి కొడాలి నాని గుడివాడను కంచుకోటగా మలుచుకున్నారు.అయితే ఈసారి ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని హై కమాండ్ గుర్తించింది. కొత్త వ్యక్తిని బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

    గుడివాడలో కమ్మ సామాజిక వర్గం అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని గత నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. విస్తరణలో పదవి కోల్పోయారు. అయితే కొడాలి నాని విషయంలో కమ్మ సామాజిక వర్గం భిన్నంగా ఆలోచించేది. తమ కులానికి చెందిన వ్యక్తిగా అభిమానించి.. ఏకపక్షంగా మద్దతు తెలిపేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. తెల్లవారు లేస్తే చాలు కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ లను తిట్టిపోస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కమ్మ కులస్తులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం జగన్ మెప్పుకోసం చంద్రబాబును తిట్టడాన్ని సహించలేకపోతున్నారు. ఈ పరిస్థితి కారణంగానే గుడివాడ నియోజకవర్గ కమ్మ సామాజిక వర్గంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న వెనిగండ్ల రాముని ఎంపిక చేసింది. దీంతో కమ్మ సామాజిక వర్గం ఆయన వైపు టర్న్ అవుతోంది. దీంతో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

    గతంలో ఎంపీగా ఉన్న బాలశౌరి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఓసారి కొడాలి నాని అనుమతి లేకుండా ప్రభుత్వ కార్యక్రమానికి బాలశౌరి హాజరు కావడం వివాదంగా మారింది. అయితే ఇటీవల బాలశౌరి పార్టీ మారారు.జనసేనలో చేరారు. దీంతో అక్కడ వివాదం సమసి పోయిందని అంతా భావించారు. అయితే వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న హనుమంతరావు అనే వ్యక్తి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయనకు సీఎంవో నుంచి పిలుపు రావడంతో కొడాలి నానిని తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తన ప్రాణానికంటే మిన్న కొడాలి నాని అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అటువంటి ప్రాణ సమానమైన కొడాలి నానిని తప్పించే సాహసాన్ని జగన్ చేస్తారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే వై నాట్ 175 అన్న నినాదంతో జగన్ ముందుకు సాగుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొడాలి నాని విషయంలో సైతం అదే మాదిరిగా వ్యవహరిస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.