https://oktelugu.com/

Rohit Sharma: మూడో టెస్ట్ ఘనత వారిదే.. గొప్ప మనసు చాటుకున్న రోహిత్

ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాగా ఆడింది. ఆ టీం బ్యాటర్లు దూకుడుగా ఉన్న టైంలో భారత బౌలర్లకు రోహిత్ శర్మ ఒక సూచన చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్ బాల్ క్రికెట్ ఆడినప్పటికీ నిదానంగా ఉండాలని రోహిత్ సూచించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 19, 2024 / 12:59 PM IST
    Follow us on

    Rohit Sharma:  క్రికెట్ అనేది సమిష్టిగా ఆడే ఆట అయినప్పటికీ.. జట్టు విజయం సాధించినప్పుడు చాలామంది కెప్టెన్లు ఆ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకుంటారు. జట్టు ఓడిపోయినప్పుడు వైఫల్యాన్ని ఇతర ఆటగాళ్ల మీదకు తోసేస్తుంటారు. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు భిన్నం. గెలిచినప్పుడు ఆ ఘనత మొత్తం టీం సభ్యులకి ఇస్తాడు. ఓడినప్పుడు ఆ భారాన్ని తనపై వేసుకుంటాడు. అందుకే ధోని తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఆదివారం రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన నేపథ్యంలో రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

    “పరుగులపరంగా చూసుకుంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమ్ ఇండియాకు ఇది అతి పెద్ద విజయం. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆరో రోజు ఆట మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగులతో నేను సెంచరీ సాధించాను. రెండవ ఇన్నింగ్స్ లో 19 పరుగులు చేశాను.. మొత్తంగా 150 పరుగులు నా ఖాతాలో ఉన్నాయి. సాధించిన ఈ విజయానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం యువ ఆటగాళ్లకు ఇవ్వాలి. వాళ్లకు అంతగా అనుభవం లేదు. అయినప్పటికీ ఆరంగేట్ర ఆటగాళ్లు సర్ఫ రాజ్ ఖాన్, ధృవ్ అద్భుతంగా ఆడారు. తమలోని సత్తాను అందరికీ చూపించారు. ఈ విక్టరీ ఎంతో సంతృప్తినిచ్చిందని” రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

    ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాగా ఆడింది. ఆ టీం బ్యాటర్లు దూకుడుగా ఉన్న టైంలో భారత బౌలర్లకు రోహిత్ శర్మ ఒక సూచన చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్ బాల్ క్రికెట్ ఆడినప్పటికీ నిదానంగా ఉండాలని రోహిత్ సూచించాడు. రోహిత్ చెప్పిన సూచనలు వర్కౌట్ అయ్యాయి. దీంతో మూడో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా తన అనుభవాన్ని మొత్తం వాడాడు. సర్ఫ రాజ్ నాణ్యమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. జైస్వాల్ మరో డబుల్ సెంచరీ బాదాడు. ధృవ్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అందువల్లే భారత్ ఈ మ్యాచ్ గెలిచిందని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

    రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నాయకుడంటే నడిపించాలని.. జుట్టు విజయం సాధించినప్పుడు అభినందించాలని.. ప్రస్తుతం రోహిత్ శర్మ చేస్తున్నది అదేనని కొనియాడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడని.. రెండవ ఇన్నింగ్స్ లో కీలకమైన సమయంలో డిక్లేర్ చేశాడని.. అతడు తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించిందని అంటున్నారు. మరో రెండు టెస్టులు కూడా ఇదే స్థాయిలో విజయం సాధించి.. జట్టుకు మరిన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుతున్నారు.