CM Jagan- Welfare Schemes: గడువులు, డెడ్ లైన్లు..ఇవి ఏపీ సీఎం జగన్ సమీక్ష చేసేటప్పుడు అధికారులు విడుదల చేసే ప్రకటనలు. ఏ శాఖ సమీక్ష అయినా ఒకటే మంత్రం. పలానా తేదీ అంటూ గడువు విధించడం.. తీరా ఆ సమయం వస్తే మాట దాటేయడం…గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న తీరే ఇది. జూలై 15 నాటికి రాష్ట్రంలో రహదారుల రూపురేఖలు మారిపోతాయని సంబంధిత అధికారులతో సమీక్షించి మరీ సీఎం జగన్ ప్రకటించారు. మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తీరా జూలై 15 దాటి 40 రోజులు గడుస్తున్నా ఒక్క రహదారి బాగుచేసిన దాఖలాలు లేవు. దీనిపై విపక్షాలు, నెటిజన్లు మండిపడ్డారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్లను నియమించనున్నట్టు ప్రకటించారు. 104 వాహనాల్లో నియమించి గ్రామీణ ప్రాంతాలకు వైద్యసేవలు మరింత విసృతం చేయనున్నట్టు ప్రకటించారు. కానీ దీనిని కూడా మడత పేచీ వేశారు. పీహెచ్ సీల్లో ఉండే ఒక వైద్యుడ్ని 104లకు బదలాయిస్తారుట. ఇలా చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదు. సీఎం జగన్ సమీక్షను అధికారులు లైట్ తీసుకుంటున్నారు. సీఎం అలానే చెబుతారు. అయినా ఆయన చెప్పినవి చేయాలంటే నిధులుండాలి కదా. అందుకే సీఎం కూడా సీరియస్ గా ఆదేశాలివ్వరు. అలా చేస్తే నిధుల సమస్య వస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన పట్టించుకోరంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

అదే సీన్ రిపీట్.
వాస్తవానికి సీఎం జగన్ చేసిన సమీక్షల తరువాత ఒక సేమ్ సీన్ రిపీటవుతుంది. సమీక్షలో సీఎం వ్యాఖ్యానాలతో కూడిన వీడియో ఒకటి విడుదల చేస్తారు. అప్పటికే ఆ వీడియోను ఎడిటింగ్ చేస్తారు. దాంతో పాటు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు. ఏ శాఖ సమీక్ష అయితే ఆ శాఖకు సంబంధించి మూడేళ్లలో జరిగిన కొద్దిపాటి మార్పులను అటు ఇటు చేస్తూ కొన్ని అంశాలను పొందుపరుస్తారు.ఇలా చేయాలని సీఎం ఆదేశించినట్టు పేర్కొంటారు.అయితే ఇలా వచ్చిన ప్రకటనలు అమలుకు నోచుకోవడం లేదు. అమలుచేసిన దాఖలాలు కూడా లేవు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష చేసే సమయంలో కూడా ఇలానే ఫ్యామిలీ డాక్టర్ ప్రకటన చేసేశారు. ఆగస్టు 15 నుంచి వీరి సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు మిన్నకుండా ఉండిపోయారు. కొద్ది నెలల్లో నియమిస్తామని కొత్త పల్లవి అందుకున్నారు.
Also Read: NFHS Survey: దేశంలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఎఫైర్లు.. ఒక్కొక్కరికి ఎంతమందితో అంటే?
అమలు చేయాలంటే ఎన్నో అడ్డంకులు..
సీఎం ఆదేశాలనే పట్టించుకోరా అంటూ సామాన్య జనాలు ప్రశ్నిస్తుంటారు.నిజానికి సమీక్షలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అలానే చెబుతారు. అలానే చెప్పాలి కూడా.లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పాలకులకు తెలుసు. అందుకే ఏదోలా మేనేజ్ చేయడానికి ఇటువంటి ఆదేశాలిస్తుంటారు. కానీ ఇలా ఆదేశాలన్ని అమలు చేయాలంటే కుదిరే పని కాదు. నిధులు కావాలి. నిబంధనలు అమలు చేయాలి. ఎన్నో అడ్డంకులు, అవరోధాలుంటాయి. అందుకే అందరూ లైట్ తీసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్ నియామకం కూడా ఇదే కాన్సెప్ట్ లోకి వస్తోంది. టీడీపీ హయాంలో నిర్మించిన మొబైల్స్ హాస్పిటల్స్ ను అటు తిప్పి ఇటు తిప్పి విలేజ్ క్లీనిక్ లుగా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. వాటిలోనే ఫ్యామిలీ డాక్టర్లను నియమించాలనుకుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత ఉంది. అక్కడ నియామకాలే జరగడం లేదు. ఇది నిధులతో కూడుకున్న పని కనుక సర్కారు ప్రస్తుతానికైతే పక్కన పడేసింది.

ఇరకాటంలో అధికారులు..
పాలకుల మాటలు ప్రకటనలకేనన్నట్టు ఏపీలో వ్యవహారం సాగుతోంది. సీఎం జగన్ రోడ్లు, మౌలిక వసతులు, విద్య, వైద్యం గురించి ప్రకటించడం..అనక మరిచిపోవడం పరిపాటిగా మారింది. సీఎం మాటలకు, పనులకు పొంతన లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. అనవసరంగా తాము ఇరకాటంలో పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా నవరత్నాలే అయినప్పుడు ఎవరు ఉండి ఏం చేసేదంటూ వారు నిట్టూర్చుతున్నారు.
[…] […]