Homeజాతీయ వార్తలుCM Jagan : అందరికీ అన్నా.. సొంత అక్కాచెళ్లల్లకి మాత్రం జగన్ విలన్

CM Jagan : అందరికీ అన్నా.. సొంత అక్కాచెళ్లల్లకి మాత్రం జగన్ విలన్

CM Jagan : ఏపీ సీఎం జగన్ తోబుట్టువులకు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. మగవారికి అన్న.. ఆడవారికి చెల్లెమ్మలు అంటూ సంభోదిస్తుంటారు. ఏ సభకు వెళ్లినా నా కోట్లాది మంది చెల్లెమ్మలు అని ప్రకటిస్తుంటారు. అటు జగనన్న అన్న సార్థక నామాన్ని సైతం జనాలపై బాగానే రద్దారు. పథకాలకు సైతం జగనన్న అని పేరు పెట్టి రాష్ట్ర ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండేలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమైందో తెలియదు. కానీ ఇద్దరు సొంత చెల్లెళ్లు మాత్రం ఆయనకు దూరం కావడం మాత్రం లోటే. షర్మిళ తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించగా.. చిన్నాన్న వివేకా కుమార్తె సునీత మాత్రం అన్న ప్రభుత్వంపై నమ్మకం లేక.. పక్క రాష్ట్రం వైపు మొగ్గుచూపారు.

అన్నీతానై షర్మిళ…
షర్మిల అయితే జగనన్న విడిచిన బాణాన్ని అంటూ 2012 ఎన్నికల వేళ ఉమ్మడి ఏపీ అంతా పాదయాత్ర చేశారు. తిరిగి 2019 నాటికి ఆమె ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించి జగన్ అధికారంలోకి వచ్చేలా చూసారు. తీరా అధికారంలోకి వచ్చాక అన్నకు దూరమయ్యారు. నమ్మించి మోసం చేశారన్న అర్ధం వచ్చేలా ఏకంగా తెలంగాణ వెళ్లి వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టుకున్నారు. అన్నతో దాదాపు సంబంధాలను తెంచుకున్నారు. తల్లి విజయమ్మను సైతం తన వెంట పట్టుకొని వెళ్లారు. జగన్ సర్కార్ మీద, వైసీపీ మీద షర్మిల ఇప్పటిదాక అరొకొరగా విమర్శలు చేస్తూ వచ్చారు. వివేకా హత్య కేసు విషయంలో మాత్రం పతాక స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సునీతకు సపోర్టు చేస్తూ జగన్ కు ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.

సునీత పోరాటం..
తండ్రి వివేకా హత్య కేసుపై సునీత గట్టి పోరాటమే చేస్తున్నారు. చివరకు అన్న జగన్ కు సైతం ఎదురుతిరిగారు. ఆయనపై తనకు నమ్మకం లేదని చెబుతూ తండ్రి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయించుకున్నారు. నిందితుల కంటే జగన్ శిబిరంతోనే సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారు.ఆయన రాజకీయ ప్రత్యర్థుల సాయాన్ని తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఆస్తుల కోసమే తండ్రిని హత్య చేయించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్న వేళ సునీతకు షర్మిళ అండగా నిలిచారు. ఏకంగా మీడియా ముందుకొచ్చి వివేకాను హత్యచేసిన అగత్యం సునీతకు లేదన్నారు. తన చిన్నాన్న ఆస్తులెప్పుడో సునీతకు రాసిచ్చిన విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు.

దూరంగా జరుగుతున్నారు..
2019 ఎన్నికల్లో అన్న జగన్ వెంట ఉన్న ఈ చెల్లెళ్లు ఇద్దరూ ఇప్పుడు వద్దనుకుంటున్నారు. సునీత బయటకు ఒక్క మాట కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా తాను చేయాల్సిన న్యాయ పోరాటానికి చేస్తున్నారు అది నాలుగేళ్ళుగా అలుపెరగని తీరులో సాగుతోంది. ఆమెకు ఇప్పటిదాకా నైతిక మద్దతుని వైఎస్ షర్మిల అందిస్తూ వచ్చారు. వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ గా షర్మిల దీక్షలు చేస్తే దీక్షా శిబిరానికి వచ్చి సునీత సంఘీభావం ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అన్న జగన్ పై చెల్లెళ్లు ఇద్దరూ ఉమ్మడి పోరాటం చేస్తున్నారన్నమాట. చూద్దాం గెలుపు ఎవరికి దక్కుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version