Uttar Pradesh: దేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పార్టీలు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుని బరిలో దిగాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సమాజీ్ వాదీ పార్టీ అభ్యర్థి అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం బెంగాల్ కు తిరిరిగి ప్రయాణం అయ్యారు.

ఈ సందర్భంగా ఆమె ప్రయాణం కుదుపులకు గురైంది. దీంతో అందరు ఆందోళన చెందారు. దీనిపై టీఎంసీ నేతలు భయాందోళన చెందారు. దీదీకి ప్రమాదం జరిగిందని హంగామా చేశారు. ఆమె ప్రయాణిస్తున్న విమానం కుదుపునకు గురి కావడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో టీఎంసీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తోంది.
యూపీలో ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దీదీని అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమానం ప్రమాదానికి గురి కావడంపై టీఎంసీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని కేంద్ర పౌరవిమాన యాన శాఖను కోరింది. ప్రమాదానికి గల కారణాలను అందజేయాలని అభ్యర్థిస్తోంది.
యూపీ నుంచి తిరిగి వచ్చే సమయంలో విమానం ప్రమాదం చోటుచేసుకోవడంతో టీఎంసీ కార్యకర్తల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. దీనిపై నిజానిజాలు నిగ్గు తేలాలని పట్టుబడుతున్నారు. దీదీకి బీజేపీకి మధ్య దూరం పెరిగిపోతోంది. యూపీ ఎన్నికల్లో యోగీ ఆదిత్య నాథ్ కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించడంపై బీజేపీ జీర్ణించుకోలేకపోతోందనే విమర్శలు వస్తున్న క్రమంలో మమతకు ప్రమాదం జరిగిందనే సంశయాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై విచారణ చేపట్టి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ కార్యకర్తల అనుమానాలు తీరే వరకు కూడా వారు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో మరింత వ్యూహాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.