Assam CM Himanta Biswa Sarma: భారత దేశం లౌకిక రాజ్యాంగం కలిగిన దేశం. అన్ని మతాలను గౌరవిస్తుంది. అయితే ఓ వర్గం వారు మాత్రం.. మన దేశంలో ఉంటూ.. మన తిండి తింటూ.. మన సౌకర్యాలు అనుభవిస్తూ.. మనకే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇది భారత్ చేసుకున్న దృరదృష్టం. తాజాగా దేశ రాజధానిలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీ బ్లాస్ట్‌పై యావత్ భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కానీ కొంత మంది వ్యతిరేక వర్గాలు మాత్రం ఈ ప్రమాదాన్ని ‘పండుగ’గా చిత్రీకరించడం… దేశ భద్రతా లేమి, విభిన్నతల లోపాన్ని గురిపెట్టే అంశం. అసోం రాష్ట్రంలోని మతీర్ రహమాన్, హసన్ అలీ మండల్, అబ్దుల్ లతీఫ్, వదుల్ కమాల్, నూరుల్ అమీర్ అహ్మద్ వంటి వ్యక్తులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేయడంతో పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
అసోం సీఎం కఠిన చర్యలు
ఇటీవలి ఢిల్లీ పేలుడుపై ‘‘భయంకరమైన సంఘటనను గౌరవించకపోవడం, అట్టి పోస్టులు చేసినవారిని ఉపేక్షించేది లేదు’’ అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 17 మందిని అరెస్టు చేసి, దేశ వ్యతిరేక రంగాలకు గట్టి హెచ్చరిక ఇచ్చారు. దేశాన్ని అవమానపరిచే సోషల్ మీడియా మూవ్‌మెంట్‌పై అసోం ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించకుండా కఠినంగా వ్యవహరిస్తోంది.
రెటైర్డ్ హెడ్ మాస్టర్ అరెస్ట్..
కచార్ జిల్లాలో మాజీ స్కూల్ హెడ్‌మాస్టర్ నజ్రుల ఇస్లాం కూడా ఈ ఘటనపై అభ్యంతరకర పోస్టు పెట్టడం ‘జిహాదీ భావజాలం’ అంతరంగాల్లో ఎంతగా పాతుకుపోయిందో వెల్లడిస్తోంది. ప్రభుత్వ రంగ పోస్ట్‌లో ఉన్నవారు కూడా ఇలా వ్యవహరించడం ‘వ్యవస్థ విషయమై’ ఆందోళన కలిగించే అంశం.2023 హమాస్ దాడిలో కూడా అసోం రాష్ట్రంలో అనేక మంది పాత్రికేయులు, ప్రజలు సోషల్ మీడియాలో సందేశాలను ఉగ్రవాదం మద్దతుగా పోస్టు చేయడంతో చాలామందిని కఠినంగా అరెస్టు చేశారు. ఇప్పటికీ కొందరు కోర్టులకు తిరుగుతున్నారు. 2019 పుల్వామా దాడిలో కూడా ‘హౌ ఈస్ ద జైష్’ కామెంట్‌తో వెలుగులోకి వచ్చిన జర్నలిస్టుపై చర్యలు తీసుకున్నారు. వాటన్నింటిపైనా అసోం ప్రభుత్వం మినహాయింపు చూపించలేదు.
స్వేచ్ఛను అనుభవిస్తూ…
ఈ సమస్యలో అసలు విలయం దేశంలో ఉంటూ, సౌకర్యాలందుకుంటూ, హక్కులు కలిగి ఉండడం… ఇలా చేస్తున్న వ్యక్తులు, దేశ ప్రతిష్ఠను దిగజారేసే హక్కు వారికి ఉందా? ఇలాంటి పోస్టులు, ప్రకటనలకు స్థానిక పరిపాలన పూర్తిగా నో చెప్పడం అవసరం. ఈ విషయంలో అసోం నాయకత్వం దేశానికి దిక్సూచిలా మారింది. ఢిల్లీ పేలుడులో బాధితుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం నెలకొన్నది. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లోనూ సోషల్ మీడియా ద్వారా ‘అభ్యంతరకర ప్రచారం’ ఎక్కువవుతోంది. ఈ తరహా గ్యాంగ్ ప్రకటనలకు పాలపంచుకుంటే, దేశ భద్రత, సామాజిక సమాజం కోసం త్వరిత గట్టి చర్యలు అవసరం.
ఇలాంటి దేశ వ్యతిరేక, నిషే«ధిత ప్రచారాలకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతయినా ఉంది. సామాజిక మాధ్యమాలను వాడి దేశ ద్రోహపు భావాలు పరచడం, ప్రజల మధ్య విధ్వేశాన్ని పెంచడం వంటి చర్యలను కఠినంగా నియంత్రించాల్సిన నేపథ్యంలో అసోం సీఎం నిర్ణయం దేశానికి దిశానిర్దేశకంగా నిలుస్తోంది.