Shahrukh Khan Vs Prabhas: బాలీవుడ్ బాద్షాగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు షారుక్ ఖాన్… ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చాయి…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తల ఎత్తుకునేలా చేశాడు. అలాంటి షారుక్ ఖాన్ గత కొన్ని రోజుల నుంచి ఏమాత్రం సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు వచ్చినవి వచ్చినట్టుగా ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ఇదే క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలకు పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపు లభించడంతో మన హీరోలు సైతం పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రతి హీరో మంచి సినిమాలను చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీని కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రభాస్ తన పంథాను మార్చుకొని డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో బాహుబలి, సాహో,సలార్, కల్కి లాంటి సినిమాలతో వరస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకు వచ్చిన ఆయన ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేయబోతున్న స్పిరిట్ సినిమా విషయంలో ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నుంచి ఒక వాయిస్ ఓవర్ రిలీజ్ చేశాడు. అందులో ప్రభాస్ ని ఉద్దేశించి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అంటూ ఒక ట్యాగ్ వేశాడు.
దాంతో ఇండియా లెవెల్లో దాని మీద భారీ చర్చలైతే జరిగాయి. ఇప్పటివరకు షారుక్ ఖాన్ ను ఇండియా టాప్ హీరో అనుకుంటుంటే, మీరు ప్రభాస్ కి ఆ ట్యాగ్ ఎలా పెడతారు అంటూ బాలీవుడ్ మీడియాలో సైతం కొన్ని కథనాలైతే వెలువడ్డాయి. మొత్తానికైతే సందీప్ తనకు నచ్చింది చేస్తూ ఉంటాడు.
తను ఎవరి మాట వినడు కాబట్టి ఇండియాలోనే టాప్ హీరో అంటే ప్రస్తుతం ఉన్న సక్సెస్ లను బట్టి ఆయన అలా వేసినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలు నుంచి షారుక్ ఖాన్ సినిమాలు ఏ మాత్రం ఆడడం లేదు. కాబట్టి ప్రభాస్ ఇప్పుడు నెంబర్ వన్ స్టార్ హీరో అని చెప్పడంలో తప్పేం లేదు. ఇక ఈ విషయాన్ని మాత్రం బాలీవుడ్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు.
మరి రాబోయే సినిమాలతో షారుక్ ఖాన్ భారీ సక్సెస్ ని కొల్లగొట్టి సాధించి 2000 కోట్ల కలెక్షన్స్ కు మించి భారీ వసూళ్లను కొల్లగొట్టినట్టయితే ఆయన ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా మారుతాడు. లేకపోతే మాత్రం కష్టమవుతోంది. ఇక ప్రభాస్ కనక రాబోయే సినిమాలతో 2000 కోట్ల మార్కును దాటితే మాత్రం షారుక్ ఖాన్ ను మించి ప్రభాస్ ముందుకు దూసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది జరగాలన్నా కూడా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…