https://oktelugu.com/

Pawan Kalyan CM: అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?

Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మరో ఐదేళ్లు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండేలా ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీ బలంగా లేకపోవడం.. జనసేన, బీజేపీ బలం పుంజుకోకపోవడం చూస్తుంటే మరో దఫా జగన్ మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ దక్కుతుందంటున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. టీడీపీతో జతకట్టే బదులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి లేదా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2022 3:38 pm
    Follow us on

    Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మరో ఐదేళ్లు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండేలా ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీ బలంగా లేకపోవడం.. జనసేన, బీజేపీ బలం పుంజుకోకపోవడం చూస్తుంటే మరో దఫా జగన్ మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ దక్కుతుందంటున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. టీడీపీతో జతకట్టే బదులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి లేదా ఒంటరిగా పోరాడాలి.

    Pawan Kalyan CM

    Pawan Kalyan CM

    జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగా లేదు.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే 2024 వరకూ జనసేన బలపడే సూచనలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష టీడీపీతోనూ జనసేన జతకట్టినా గెలుపు కష్టమేనని అర్థమవుతోంది. 2024లో కనుక 50కి పైగా సీట్లు గెలవకపోతే టీడీపీ శాశ్వతంగా మూతపడడం ఖాయం. అలాంటప్పుడు జనసేన.. టీడీపీతో పొత్తు పెట్టుకున్న వృథానే.. అందుకే 2024లో జనసేనకు అవకాశాలు ఏమాత్రం అనుకూలంగా లేవని చెప్పొచ్చు.

    Also Read:

    1. KCR-Jagan: మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?
    2. Uttar Pradesh: యూపీ అభ్య‌ర్థుల్లో నేర‌స్తులు, కోటీశ్వ‌రులే ఎక్కువా?

     

    అయితే 2024లో టీడీపీ కనుక బలం పుంజుకోకుండా చతికిలపడితే మాత్రం ఇక ఆ పార్టీకి ఏపీలో భవిష్యత్ లేనట్లే.. 2029లో రెండు ప్రాంతీయ పార్టీలు వైసీపీ, జనసేన మధ్య పోరు నడుస్తుంది. ఆ సమయానికి వైసీపీపై రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ ను 2029లో సీఎం కుర్చీలో కుర్చుండబెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    కాబట్టి ఈ సింపుల్ లాజిక్ ను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వచ్చే 2024 వరకూ ఎలాగూ బలం పుంజుకోలేరు కనుక 2029పై దృష్టి సారించాలి. ఏడేళ్లకు ప్రణాళిక వేసుకోవాలి. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా నిలబడి.. ప్రజల్లోకి వెళ్లి వారి మనసులు గెలుచుకోవాలి. అప్పుడే ప్రయోజనం ఉంటుంది.

    జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకసారి ఓడిపోయి.. మరోసారి వన్ మ్యాన్ ఆర్మీగానే అధికారంలోకి వచ్చాడు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మరిచిపోకూడదు. అలానే 2024లో పోరాడి గెలవకపోయినా ప్రజల్లో ఉంటే 2029 వరకూ ఖచ్చితంగా సీఎం సీటులో కూర్చోగలరు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకు 70 ఏళ్లు దాటాయి. ఇంకో పదేళ్లకు 80 ఏళ్లకు చేరువ అవుతారు. వృద్ధాప్యంతో ఆయన పార్టీని నడపలేరు. ఆయన వారసుడు లోకేష్ తో అయ్యే పని కాదు. సో 2029లో పవన్ కళ్యాణ్ యే సీఎం అనడంలో ఎలాంటి సందేహం లేదు. చేయాల్సిందల్లా ఆయన ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయడమే..!

    Also Read:  మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం