Mohan Babu: మోహన్‌బాబు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో చాలా విషయాల పై మాట్లాడారు. సినిమా పరిశ్రమ మొత్తం ఒకటే కుటుంబం అంటారు కానీ, మళ్ళీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు అంటూ మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ప్రెస్ మీట్ లో మోహన్ బాబు ఇంకా మాట్లాడుతూ.. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం పెట్టారని మోహన్ బాబు సీరియస్ అయ్యారు.

మోహన్ బాబు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పరిశ్రమలో పలువురు ఆర్టిస్టులు భారీగా పారితోషికం తీసుకుంటున్నారు అని అంటున్నారు. అయితే నేను ఇతర ఆర్టిస్టులు తీసుకుంటున్న పారితోషికాలు నాకు అనవసరం. నా గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఒక్కటి మాత్రం నిజం. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే బయట రాజకీయాలు చేస్తారు.
Also Read: సొంత మరదళ్లను పెండ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!
ఇండస్ట్రీలో ఎవరికి వారే గ్రేట్ అనుకుంటారు. నా దృష్టిలో ఎవరూ గొప్ప కాదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నాం అనేది పచ్చి నిజం. గతంలో ఎప్పుడూ అలా లేదు. అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు, ఇతర నటీనటులందరం కలిసి ఒకే చోట కూర్చొని సరదాగా
మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రితో జరిపిన మీటింగ్ లో సీఎంవో నుంచి నాకు కూడా ఆహ్వానం ఉంది. అయినా ఎందుకు నన్ను పిలవలేదు. వాళ్లు పిలిచినా, పిలవకపోయినా.. నాకంటూ ఒక చరిత్ర ఉంది. నాకంటూ ఒక గౌరవం ఉంది, అలాగే ఒక విలువ ఉంది. అందుకే.. నేను ఏది పట్టించుకోను’ అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏది పట్టించుకోను అంటూనే మోహన్ బాబు చాలా విషయాలు పట్టించుకున్నారు.
Also Read: సొంత మరదళ్లను పెండ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!