
కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇటీవల అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఆ వైరస్ బారిన పడ్డాడు. మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఈ రోజు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కూడా అవుతున్నారు. ఈ విషయాన్ని మేరీల్యాండ్‌లోని బేతెస్థలో గల వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ డాక్టర్లు వెల్లడించారు.
ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ఆదివారం ఆయన జనం ముందుకు వచ్చారు. ఆసుపత్రి ఆవరణలో తన కాన్వాయ్‌లో కలియతిరిగారు. కరోనా సోకిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారు. ఆ వ్యాక్సిన్‌తోనే ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యాక్సిన్ రెమ్‌డెసివిర్. డొనాల్డ్ ట్రంప్‌నకు రెమ్‌డెసివిర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు మిలటరీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. తొలి డోసుతో ఆయనపై కరోనా ప్రభావం తగ్గిందని, అనంతరం రెండో డోసును అందించామని చెప్పారు.
Also Read: అమెరికాకు రావడానికి వారికి నో పర్మిషన్..
ఆ డోస్ వేశాక ట్రంప్ కిడ్నీలు, కాలేయం పనితీరు సాధారణ స్థితికి వచ్చినట్లు స్పష్టం చేశారు. రెండో డోసు అనంతరం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని చెప్పారు. ఆయన శరీర ఆక్సిజన్ స్థాయి ఇప్పుడు 98 శాతంగా నమోదైందని తెలిపారు. సోమవారం ఉదయమే డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. డిశ్చార్జి అనంతరం ఆయన కొంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వైట్‌హౌస్‌లో ఎలాంటి జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందనే విషయంపై అవగాహన కల్పించామన్నారు.
ఎట్టకేలకు తన ఆరోగ్యం కుదుటపడడంతో ట్రంప్ బ్లాక్ కలర్ ఎస్‌యూవీ కారులో బ్యాక్‌సీట్‌లో కూర్చుని కలియతిరిగారు. తనను పలకరించడానికి వచ్చిన మద్దతుదారులకు కారులో నుంచే చేతులు ఊపుతూ అభివాదం చేశారు. వారిని ఉత్సాహపరిచేలా చప్పట్లు కొడుతూ ఉల్లాసంగా కనిపించారు. 20 నిమిషాల పాటు ట్రంప్ ఆసుపత్రి ఆవరణలోనే కారులో గడిపారు. ట్రంప్‌ను చూడగానే ఆయన మద్దతుదారులు అమెరికా జాతీయ పతకాన్ని ఊపుతూ యూఎస్ఏ అంటూ నినదించారు.
Also Read: జోరందుకున్న స్టాక్‌మార్కెట్లు..
కరోనా రావడంపై ట్రంప్ కూడా స్పందించాడు. ఆస్పత్రి వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు. కరోనా వచ్చినప్పటి నుంచి కోలుకునే వరకూ తన ప్రయాణం అద్భుతంగా, ఆసక్తికరంగా సాగిందని అన్నారు. ఈ జర్నీలో అనేక విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. స్కూళ్లో వచ్చే డౌట్స్‌లాగే కరోనా వైరస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నానన్నారు. తాను మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో చురుకుగా పాల్గొంటానని అన్నారు. గ్రేట్ అమెరికాగా తీర్చిదిద్దడానికి తనకు మరోసారి అవకాశం లభిస్తుందనే విశ్వాసం ఏర్పడిందని చెప్పారు.