Homeజాతీయ వార్తలుTelangana BJP: టీబీజేపీలో ముసలం.. తారాస్థాయికి వర్గపోరు!

Telangana BJP: టీబీజేపీలో ముసలం.. తారాస్థాయికి వర్గపోరు!

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో సందడి లేదు. వర్గ పోరాటం కారణంగానే తీవ్రంగా నష్టపోయిన ఆ పార్టీలో.. ఫలితాల తర్వాత కూడా వర్గపోరు కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వర్గాల మధ్య కొన్ని రోజుల క్రితం మొదలైన ముసలం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతోంది.

సంజయ్‌ను తప్పించి చతికిల పడి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కొంత మంది నేతల ఒత్తిడితో బీజేపీ అధిష్టానం అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించింది. ఈమేరకు ఒత్తిడి తెచ్చిన నేతలుగా ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఎంపీ అర్వింద్‌ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇక కిషన్‌రెడ్డి సారథ్యంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. కానీ, పూర్తిగా చతికిలపడింది. బండి సంజయ్‌ను తప్పించేందుకు యత్నించిన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. బండి సంజయ్‌ సారథిగా కొనసాగిఉంటే కాంగ్రెస్‌ స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచరవర్గం తెరపైకి తీసుకొచ్చింది. దీంతో బండి సంజయ్‌ అనుచరులకు కౌంటర్‌ ఇస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటల రాజేందర్‌ అనుచరులు. తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్‌ వారిని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు. చివరకు తన పార్లమెంట్‌ పరిధిలోకూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని ఈటల అనుచరులు ఫైర్‌ అవుతున్నారు.

శృతి మించుతున్న సోషల్‌ వార్‌..
ఒకవైపు బండి, మరోవైపు ఈటల అనుచరుల మధ్య సోషల్‌ మీడియా వేదికగా వార్‌ జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు శృతి మించుతుండడంతో ఈటల రాజేందర్‌ స్పందించారు. సోషల్‌ మీడియాలో తన పేరుతో.. తన అనుచరుల పేరుతో పెడుతున్న పోస్టులన్నీ ఫేక్‌ అని ప్రకటించారు. అయితే ఈ సోషల్‌ మీడియా వార్‌ బండి, ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్‌ కిషన్‌రెడ్డిని సైతం వదలడం లేదు. పార్టీ ఓటమికి కారణం ఆయనేనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిని కంట్రోల్‌ చేయాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు.

బండికి మళ్లీ బాధ్యతలు..?
బండి సంజయ్‌కు మళ్లీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సీనియర్‌ నేతలంతా సైలెంట్‌ అయ్యారు. దీనికి కారణం తాము టిక్కెట్లు ఇప్పించుకున్న వారు ఓడిపోవడమే. కిషన్‌రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గంలో బీజేపీని గెలిపింలేకపోయారు. పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో మూడు నెలల్లోనే ఉన్నాయి. మరోవైపు బీజేపీలో ముసలం ముదురుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో కొంత మంది సీనియర్లు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Oktelugu Epaper
Exit mobile version