https://oktelugu.com/

ఘర్షణ: టీఆర్ఎస్, బీజేపీ డిష్యూం డిష్యూం

హుజూరాబాద్ రణరంగమైంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఘర్షణ మొదలైంది. ఈ సీటును చేజిక్కించుకునేందుకు ఇప్పటికే మోహరించిన పక్షాలు ఇప్పుడక్కడ ఎదురుపడితే కొట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏకంగా వాగ్వాదాలు, దాడుల వరకు సాగుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ , బీజేపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హుజూరాబాద్ అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున సోదరుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2021 / 03:48 PM IST
    Follow us on

    హుజూరాబాద్ రణరంగమైంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఘర్షణ మొదలైంది. ఈ సీటును చేజిక్కించుకునేందుకు ఇప్పటికే మోహరించిన పక్షాలు ఇప్పుడక్కడ ఎదురుపడితే కొట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏకంగా వాగ్వాదాలు, దాడుల వరకు సాగుతోంది.

    కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ , బీజేపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హుజూరాబాద్ అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున సోదరుడు మధుసూదన్ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అదే విషయంపై రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగాయి. దీన్ని టీఆర్ఎస్ వర్గీయులే సృష్టించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.

    ఈ క్రమంలోనే ఈటల జమున అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు తగుల బెట్టేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను అడ్డుకొని నిలువరించారు. టీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పంపించివేశారు.

    హుజూరాబాద్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయేలా ఉండడంతో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఇక్కడ పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి.