Homeజాతీయ వార్తలుMaharashtra CM: మహారాష్ట్ర సీఎంపై స్పష్టత.. బీజేపీ పెద్దల కొత్త ఫార్ములా ఇదే..

Maharashtra CM: మహారాష్ట్ర సీఎంపై స్పష్టత.. బీజేపీ పెద్దల కొత్త ఫార్ములా ఇదే..

Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిదో అని రెండు నెలలు సాగిన ఉత్కంఠకు నవంబర్‌ 23న తెరపడింది బీజేపీ నేతృత్వంలోని శివసేన(ఏక్‌నాథ్‌షిండే), ఎన్‌సీపీ(అజిత్‌పవార్‌) పార్టీల కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్‌సీపీ 41 స్థాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. మహాయుతి గెలుపుతో కొత్త ప్రభుత్వం కొలుదు దీరడం ఖాయమైంది. కానీ, సీఎం ఎవరు అనేదానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌షిండే సీఎం పదవికి రాజీనామా చేశారు. నవంబర్‌ 27తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 26వ తేదీన సీఎంను ఖరారు చేయాల్సి ఉంది. అయితే సీఎం ఎవరు అనేదానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఫడ్నవీస్‌ కోసం బీజేపీ పట్టు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో సీఎం పదవి తమకే కావాలని బీజేపీ పట్టుపడుతోంది. అయితే తమ కారణంగానే ఎన్నికల్లో గెలిచామని, ఏక్‌నాథ్‌షిండే ప్రవేశపెట్టిన పథకాలే కూటమిని గెలిపించాయని శివసేన నేతుల అంటున్నారు. ఏక్‌నాథ్‌షిండేనే మళ్లీ సీఎం కావాలని కోరుతున్నారు. షిండే కూడా సీఎం పదవి వదులుకోవడానికి ముందుగా నిరాకరించారు. ఫడ్నవీస్‌ కూడా సీఎం పదవి కావాలని పట్టుపడుతున్నారు. ఎవరూ తగ్గకపోవడంతో సస్పెన్స్‌ వీడడం లేదు.

రంగంలోకి బీజేపీ పెద్దలు..
ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా సీఎంపై స్పష్టత రాకపోవడంతో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. బిహార్‌ మోడల్‌ అనుసరించాలని శివసేన నేతలు కోరుతున్నారు. బిహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. నితీశ్‌కుమార్‌ను సీఎంను చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ, బీజేపీ దీనికి సముఖంగా లేదు. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. 2+2+1 ఫార్ములాతో ఫడ్నవీస్‌ రెండేళ్లు.. ఏక్‌నాథ్‌షిండే రెండేళ్లు, అజిత్‌పవార్‌ ఏడాది సీఎంగా ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు కూటమిలో చీలిక రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

2019 సీన్‌ రిపీట్‌ అవుతుందా?
నాలుగు రోజుల ఉత్కంఠ నేపథ్యంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2019నాటి సీన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. 2019లో బీజేపీ శివసే కలిసి పోటీ చేశాయి. సీఎం పోస్టు విషయంలో విభేదాలు రావడంతో శివసేన ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పానటు చేసింది. తర్వాత శివసేన నేత ఏక్‌నాథ్‌షిండే.. పార్టీని చీల్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా షిండే కూటమి నుంచి బయటకు వచ్చి.. ఉద్ధంథాక్రే శివసే, కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఏక్‌నాథ్‌ షిండే బయటకు వెళ్లినా బీజేపీకి ఎన్‌సీపీ (అజిత్‌పవార్‌) మద్దతు ఉంది. దీంతో బీజేపీ కూడా ఏక్‌నాథ్‌ పట్టువిడవాలని సూచిస్తోంది. అయితే బీజేపీ ఫార్ములా 2+2+1 కు మూడు పార్టీలు ఓకే అయితే అందరికీ సమాన ప్రాధాన్యం దక్కుతుందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version