Chandrababu: చంద్రబాబు విషయంలో గట్టి పట్టుదలతో సిఐడి

కేసు విచారణ జరుగుతుండగా సాక్షాలు లేవని కారణాలు చూపుతూ బెయిల్ ఇవ్వడంపై సిఐడి తరపు న్యాయవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : November 22, 2023 6:03 pm

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చి హైకోర్టు పరిధి దాటిందా? ఈ అంశంపైనే జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం దేనికి సంకేతం? కేసులు అసలు సాక్షాలు లేవని చెప్పడం కలవరపాటుకు కారణమా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. స్కిల్ కేసులు ఏపీ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్టే విధించాలని కోరుతూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు చర్చకు ఇదే కారణం అవుతోంది.

కేసు విచారణ జరుగుతుండగా సాక్షాలు లేవని కారణాలు చూపుతూ బెయిల్ ఇవ్వడంపై సిఐడి తరపు న్యాయవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని చెబుతున్నారు. చార్జిషీట్ వేయనంతవరకు దర్యాప్తు కొనసాగుతున్నట్లేనని భావిస్తున్నారు. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సైతం దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీ హైకోర్టు ఈ కేసులో మినీ ట్రైల్ మాత్రమే జరిపిందని.. ఇది చట్ట విరుద్ధమని, ఇది సామాజిక ఆర్థిక కుంభకోణమని సిఐడి తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు స్పష్టం చేసిందని.. జైల్లో 73 ఏళ్లు దాటిన వారందరికీ కోసం సిఆర్పిసి చట్టం సవరిస్తే గొడవ ఉండదని సిఐడి తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి చెప్పడం విశేషం.

చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ బెయిల్ దక్కదని సిఐడి అంచనా వేసింది. ఎన్నికల ముంగిట చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవచ్చని భావించింది. అందుకే వైసిపి సైతం ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ పై క్యాబినెట్ మంత్రి, గుండె వ్యాధి నిపుణుడు సీదిరి అప్పలరాజు వాళ్ళ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలువురు మంత్రులు చంద్రబాబు ఆరోగ్యం పై రకరకాలుగా మాట్లాడారు. ఇవన్నీ రెగ్యులర్ బెయిల్ విషయంలో ప్రభావం చూపుతాయని భావించారు. కానీ వీటిని హైకోర్టు న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోలేదు. చంద్రబాబు వయసు, అనారోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాము భావించిన దానికంటే విరుద్ధంగా తీర్పు రావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేక పోయారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.