https://oktelugu.com/

రఘురామకు పంచ్ ఇచ్చిన సీఐడీ

చింతచచ్చినా పులుపుచావని చందంగా ఒక సారి వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్ట్ అయినా కూడా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎక్కడా తగ్గడం లేదు. తన అరెస్ట్ సమయంలో జరిగిన పరిణామాలపై కేసులు పెడుతూ.. కోర్టులకు ఎక్కుతూ.. జగన్ బెయిల్ రద్దుపై పిటీషన్లు వేస్తూ మళ్లీ నానా యాగీ చేస్తూనే ఉన్నాడన్న విమర్శలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా తన సెల్ ఫోన్ ను సీఐడీ పోలీసు అధికారులు తీసుకున్నారని.. అందులో విలువైన సమాచారం ఉందని.. దాంతో కొంతమందికి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2021 / 08:00 PM IST
    Follow us on

    చింతచచ్చినా పులుపుచావని చందంగా ఒక సారి వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్ట్ అయినా కూడా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎక్కడా తగ్గడం లేదు. తన అరెస్ట్ సమయంలో జరిగిన పరిణామాలపై కేసులు పెడుతూ.. కోర్టులకు ఎక్కుతూ.. జగన్ బెయిల్ రద్దుపై పిటీషన్లు వేస్తూ మళ్లీ నానా యాగీ చేస్తూనే ఉన్నాడన్న విమర్శలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి.

    తాజాగా తన సెల్ ఫోన్ ను సీఐడీ పోలీసు అధికారులు తీసుకున్నారని.. అందులో విలువైన సమాచారం ఉందని.. దాంతో కొంతమందికి బెదిరింపులు మెసేజ్ లు వెళుతున్నాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అంతేకాదు..ఏపీ సీఐడీ పోలీసులపై ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

    తన సెల్ ఫోన్ ను ఏపీసీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు, లీగల్ నోటీసుల పేరుతో చేస్తున్న హడావుడిపై తాజాగా ఏపీ సీఐడీ సీరియస్ అయ్యింది. దానికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

    ఎంపీ రఘురామ కావాలనే యాగీ చేస్తున్నాడని.. ప్రజలను, మీడియాను తప్పు దారి పట్టిస్తున్నాడని ఏపీ సీఐడీ తెలిపింది. మే 15న రఘురామ మొబైల్ ఐపోన్ 11 ను స్వాధీనం చేసుకున్నామని.. ఇద్దరి సాక్ష్యుల ముందు రఘురామ స్టేట్ మెంట్ రికార్డ్ చేశామని.. మొబైల్ ఫోన్ సీజ్ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపామని సీఐడీ స్పష్టం చేసింది. రఘురామ ఐఫోన్ ను ఫోరెన్సిక్ కు పంపించామన్నారు. ఫోన్ డేటాను మే 31న కోర్టుకు అందించామన్నారు.

    ఇక తన ఫోన్ ను సీజ్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేయడం కేసును పక్కదారి పట్టించడమేనని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు సీఐడీ సిద్ధమైంది.