https://oktelugu.com/

Chiranjeevi : స్వయంగా కేరళ వెళ్లి అక్కడ సీఎం కలిసి చిరంజీవి చేసిన సర్ప్రైజ్ ఇది…

మనలో చాలా మంది సినిమాలను సరదా కోసం చూస్తారు. కానీ దాని మీదనే చాలా మంది డిపెండ్ అయి ఉంటారు... అలాంటి వాళ్ళు తమ లైఫ్ ను డిజైన్ చేసుకోవాలంటే మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తు ఉంటారు..

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 07:41 PM IST
    Follow us on

    Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సినిమాల వరకే పరిమితం అవ్వకుండా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగిన, ప్రకృతి వైపరిత్యాలు ఎదురైనా ఆయా ప్రభుత్వాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా హీరోలు రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన విపత్తులకు చాలాసార్లు సహాయాన్ని అందజేసి జనాన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే కేరళ రాష్ట్రం లో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి అక్కడ జనం అతలాకుతలం అయిపోయారు. ఇక ఇలాంటి పరిస్థితిలో తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు కేరళ ప్రభుత్వానికి చేయూతనందిస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు… అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రీసెంట్ గా ఆర్థిక సహాయం చేస్తున్నట్టుగా ప్రకటించిన చిరంజీవి…ఈరోజు తనే స్వయంగా కేరళకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి అయిన శ్రీ ‘పినరాయి విజయన్’ గారిని కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఇక ఇది చూసిన అభిమానులు తమ హీరోలు సినిమాల వరకే పరిమితం అవ్వకుండా ప్రమాదం ఎదురైన ప్రతిసారి ఎంతో కొంత సహాయాన్ని అందజేసి ఆ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తారు అంటూ చిరంజీవి అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ కాలరేగిరేసుకుంటున్నారు… చిరంజీవి అనే కాకుండా తెలుగు నుంచి చాలామంది హీరోలు కూడా వాళ్ళ సహాయాన్ని అయితే అందజేశారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం మన హీరోలు పాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్లడమే కాకుండా ఆదరిస్తున్న జనాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఒక సామాజిక స్పృహను కలిగి ఉండి ఇలాంటివి ఎదుర్కోవడానికి గవర్నమెంట్ కు అండగా నిలబడడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

    నిజానికి తెలుగులో ఉన్న స్టార్ హీరోలు ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రానికి ఆపద వచ్చినా కూడా ఆదుకుంటారు. కానీ మన తెలుగులో ఆపద వస్తే మాత్రం చాలా మందికి సహాయం చేయడానికి వెనుక ముందు ఆడుతూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు ఎదురవ్వడం అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది.

    అయినప్పటికీ మన హీరోలు మనకెప్పుడూ అండగా ఉన్నారని ప్రేక్షకులు కూడా వాళ్ళ సినిమాలని ఆదరించడానికి వాళ్ళ సినిమాలను చూడటానికి ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం వల్ల హీరోల ఇమేజ్ పెరగడమే కాకుండా మన సినిమాలని జనాలు చూడడానికి ఆసక్తి చూపించే విధంగా ఉపయోగపడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    వయనాడ్ ప్రాంతాన్ని వీలైనంత తొందరగా రికవరీ చేసి అక్కడ ఉన్న ప్రజలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దాలని తద్వారా నిరాశ్రయులైన చాలా మందికి ఆశ్రయాన్ని కల్పించాలని యావత్ ఇండియా లో ఉన్న జనాలు కోరుకుంటున్నారు… కేరళ ప్రభుత్వం కూడా తమ దగ్గర ఉన్న ఫండ్స్ ద్వారా ఆ ప్రాంతాన్ని మళ్లీ పునర్ నిర్మించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…