https://oktelugu.com/

Chiranjeevi: బద్నామ్ చేస్తారా? ఆ మూడు న్యూస్ చానెల్స్ కు షాకిచ్చిన చిరంజీవి

Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత పవర్ ఫుల్ నో.. అంతకు మించిన శక్తి మీడియాకు ఉంది. అగ్ర మీడియా సంస్థలన్నీ దాదాపుగా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి. అధికార పార్టీకి కూడా సొంత మీడియా సంస్థలున్నాయి. ఈ క్రమంలోనే ఒంటరిగా వచ్చిన చిరంజీవిని నాడు మీడియా వెంటాడింది.. వేటాడింది. ఆయన చేయని తప్పులకు సైతం తప్పుగా చూపించి అభాసుపాలు చేసింది. అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి రోజులు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి 2008లో ప్రజారాజ్యం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2021 / 04:21 PM IST
    Follow us on

    Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత పవర్ ఫుల్ నో.. అంతకు మించిన శక్తి మీడియాకు ఉంది. అగ్ర మీడియా సంస్థలన్నీ దాదాపుగా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి. అధికార పార్టీకి కూడా సొంత మీడియా సంస్థలున్నాయి. ఈ క్రమంలోనే ఒంటరిగా వచ్చిన చిరంజీవిని నాడు మీడియా వెంటాడింది.. వేటాడింది. ఆయన చేయని తప్పులకు సైతం తప్పుగా చూపించి అభాసుపాలు చేసింది.

    chiranjeevi

    అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి రోజులు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్తాపించారు. తెలుగునేలను షేక్ చేసి అశేష ప్రజానీకాన్ని ఆకర్షించారు. ఈ క్రమంలోనే 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత యాత్ర చేశారు. బస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం చిరంజీవి తిరిగారు. ప్రజలను ఫ్యాన్స్ ను కలుసుకున్నారు.

    ఈ ప్రజా అంకిత యాత్ర సమయంలో మీడియా వ్యవహరించిన తీరును తాజాగా ఓ కార్యక్రమంలో చిరంజీవి తలుచుకొని కడిగిపారేశాడు. ఆ సమయంలో తనకు మీడియా సపోర్టు లేదని.. ఎక్కడ దొరుకుతానా? అని వేచిచూసి మరీ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    Also Read: వాళ్ళెంత చూపించినా సాయిపల్లవి క్రేజే వేరు !

    బస్సులో కూర్చున్నాక తనకు మా బాయ్ ‘ఖర్జురాలు తినడానికి ఇచ్చాడని.. వాటికోసం నా చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడాన్ని మీడియా వీడియో తీసిందన్నారు. ఆ తర్వాత నేను ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియోను తీసుకొని దాన్ని దీన్ని కలిపి ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాక నేను చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నట్టు వీడియోను చక్కగా ఎడిట్ చేశారని.. పదేపదే టీవీలో చూపించి తనను బద్నాం చేసి తన ఓటమికి ఇదే మీడియా కారణం అయ్యిందని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తాను పండ్లు తినడానికి శానిటైజ్ చేసుకున్న వీడియోను, ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియోను కలిపి తనను ఇలా మూడు మీడియా చానెల్స్  పనిగట్టుకొని  విషప్రచారం చేశాయని చిరంజీవి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి మాట్లాడిన ఈ వీడియో వైరల్ గా మారింది.

    Also Read: ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​పై పెరుగుతున్న అంచనాలు.. ​ఆకట్టుకుంటున్న న్యూ పోస్ట్​