Homeఆంధ్రప్రదేశ్‌జగన్ నాయకత్వం అభినందనీయం: చిరంజీవి

జగన్ నాయకత్వం అభినందనీయం: చిరంజీవి

కరోనా మహమ్మారి కారణంగా దేశం అతలాకుతలం అయిపోయింది. ప్రజా రక్షణార్థం కోసం ఏపీ ప్రభుత్వం మెగా వ్యాక్సిన్ డ్రైవ్ ని చేపట్టి ఒక్క రోజులోనే 13 లక్షలకు పైగా వ్యాక్సిన్ లను వేశారు. దాంతో జగన్ ప్రభుత్వం మీద ప్రశంసల వెల్లువ మొదలైంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ కు, అలాగే జగన్ ప్రభుత్యానికి అభినందనలు తెలియజేశారు. చిరంజీవి ట్విటర్‌ లో పోస్ట్ చేస్తూ “ఒక్క రోజులో ఆంధ్ర ప్రదేశ్ […]

Chiranjeevi Jagan

కరోనా మహమ్మారి కారణంగా దేశం అతలాకుతలం అయిపోయింది. ప్రజా రక్షణార్థం కోసం ఏపీ ప్రభుత్వం మెగా వ్యాక్సిన్ డ్రైవ్ ని చేపట్టి ఒక్క రోజులోనే 13 లక్షలకు పైగా వ్యాక్సిన్ లను వేశారు. దాంతో జగన్ ప్రభుత్వం మీద ప్రశంసల వెల్లువ మొదలైంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ కు, అలాగే జగన్ ప్రభుత్యానికి అభినందనలు తెలియజేశారు.

చిరంజీవి ట్విటర్‌ లో పోస్ట్ చేస్తూ “ఒక్క రోజులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 13 లక్షల 72వేలు మందికి వ్యాక్సిన్ వేయడం అనిర్వచనీయమైన అభినందనీయం. జగన్ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకు మంచి ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ నాయకత్వాన్ని అందిస్తున్న శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కంగ్రాట్స్ తెలుపుతున్నాను’ అంటూ మెగాస్టార్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా సహా బయట పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాటి పై తనదైన శైలిలో స్పందిస్తూ.. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో పంచుకుంటూ మొత్తానికి ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సేవ చేస్తోన్న చిరు, ఈ కరోనా కాలంలో కూడా ఎంతో మందికి కడుపు నింపారు.

పైగా ఇటీవల చిరంజీవి తన ఆక్సిజన్ బ్యాంకులు స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాలలోని కరోనా బాధితులకు వాటిని అందిస్తూ మళ్ళీ తానూ అందరికి ఆపద్బాంధవుడ్ని అని నిరూపించుకున్నాడు. అయితే, మెగాస్టార్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించడం పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పడానికే మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper